ఎవరు ఎన్నిచెప్పినా మోదీ ప్రధాని అయిన తర్వాతే కాదు... ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన పరిపాలనలో ఎప్పుడు అసహనం పెరుగుతూనే ఉంటోంది. ఆయన చేసే పనులు, అధికారంలో ఉన్నామనే ధీమా, తాము ఏమి చేసినా ప్రజలు మౌనంగా ఉంటారనే భ్రమ. దక్షిణాది నుంచి కాకపోయినా కేవలం ఉత్తారాది రాష్ట్రాల ద్వారా అధికారం చేపట్టవచ్చుననే బరితెగింపు ఆయనలో కనిపిస్తున్నాయి. నాడు ఒక్క 'నిర్భయ' ఘటనలు జరిగితే నేడు వాటి సంఖ్య లక్షలకు పెరిగిపోయింది. చివరకు గౌరీలంకేష్ వంటి జర్నలిస్ట్‌లను కూడా క్రూరంగా చంపినా ఆయన పెదవి విప్పలేదు. ఇంతలా దేశంలో అసహనం పెరిగిపోతోందని, మోదీ తానో నియంతగా ఫీలవుతున్నాడన్న విషయం ప్రజల్లోకి మెల్లిగా వెళ్తోంది.
స్విస్ బ్యాంకుల నల్లకుబేరుల గుట్టు విప్పలేదు. బడా బాబులు కోట్లాది సొమ్మును బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు వెళ్లినా వారి గురించి ప్రధాని నోరు విప్పరు. సామాన్యులకు మాత్రం మీ మంచికోసం పెద్ద నోట్ల రద్దును అందరు భరించాలని మాత్రం సందేశాలు ఇస్తాడు. ఇక ఈయన ఆగడాలకు కర్ణాటక ఓటర్లు అయినా తగిన గుణపాఠం చెప్పి, ఆయనలోని అహంకారాన్ని దించుతారనే ఆశతో ప్రజానీకం ఉంది. ఇక ఉత్తారాదిలో కూడా ఈయన పట్ల నెగటివ్‌నెస్ బాగానే పెరుగుతోంది.
ఇక దేశంలో పెరిగిపోతున్న ఆడవారిపై అత్యాచారాలు, ఇతర విషయాల విషయంలో పాపం మోదీ ఇంతకాలానికి నోరు విప్పాడు. సామాజిక బాధ్యత గురించి తమ కుమారులకు వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు చెప్పాలని, ఇలా చేస్తే మన ఆడపిల్లలను కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదనే కొత్త విషయాన్ని ఆయన చెబుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. చేతిలోఅధికారం, 12ఏళ్ల లోపు వారిని అత్యాచారం చేస్తే ఉరిశిక్ష, 16ఏళ్ల పైబడిన వారికి జీవితఖైదు తెచ్చిన ఆర్డినెన్స్ అద్భుతంగా ఉందని ఆయన ఆయనకు కితాబునిచ్చుకున్నాడు. చేతిలో అధికారం పెట్టుకుని పక్కవారికి నీతులు చెప్పడం అంటే ఇదే.