తెలుగులో చరిత్ర సృష్టించే చిత్రాలు కొన్నే. తెలుగు చిత్రసీమలో 'శివ' తర్వాత సినిమాలను ఇలాగే తీయాలి? అనే మాటలను పక్కనపెట్టి ఇలాగా కూడా సినిమాలను తీయవచ్చని నిరూపించిన చిత్రం 'అర్జున్‌రెడ్డి'. కిందటి ఏడాది విడుదలైన ఈచిత్రం సాధించిన విజయం అంతా ఇంతకాదు. దీనిని రివల్యూషనరీ ఫిల్మ్‌గా కొందరు చెప్పుకుంటూ ఉంటారు. ఈ చిత్రం విడుదలయ్యే నాటికి ఏదో 'పెళ్లిచూపులు' వంటి ఫ్యామిలీస్టోరీ చేసిన విజయదేవరకొండగా మాత్రమే ఆయన ప్రేక్షకులకు తెలుసు.కానీ ఈ చిత్రం తర్వాత ఆయన యూత్‌కి ఐకాన్‌గామారి, 'అర్జున్‌రెడ్డి'గా మారిపోయాడు. ఇక ఇదే తనకు దర్శకునిగా మొదటిచిత్రం అయినప్పటీ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కూడా ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఇక ప్రస్తుతం 'అర్జున్‌రెడ్డి' రీమేక్ తమిళం, హిందీ భాషల్లో రూపొందుతోంది. తమిళ వెర్షన్‌కి బాలా దర్శకత్వం వహిస్తుండగా, హిందీవెర్షన్‌కి సందీప్‌రెడ్డినే దర్శకత్వం వహించనున్నాడు.
ఇక విజయ్‌దేవరకొండ ప్రస్తుతం చేతిలో అరడజను పెద్ద చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు సందీప్‌రెడ్డి వంగా మహేష్‌బాబు, రామ్‌చరణ్‌లతో చిత్రాలు చేసే ఉద్దేశ్యంలో ఉన్నాడు. దీనికై ఆయన గట్టి ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. ఇక తాజాగా విజయ్‌దేవరకొండ మాట్లాడుతూ, ఇటీవల నేను, ఈ చిత్రం దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కలిసి అర్జున్‌రెడ్డి 40ఏళ్ల వయసుకు వస్తే ఆయన ప్రవర్తన, నడవడిక ఎలా ఉంటాయి? అతనెలా ఉంటాడు? ఆయన జీవితం ఎలా మారిపోయి ఉంటుంది? వంటివి మాట్లాడుకున్నామని, త్వరలో 'అర్జున్‌రెడ్డి'కి సీక్వెల్ వచ్చినా ఆశ్యర్యం లేదన్నట్లు మాట్లాడాడు. అయినా ఇప్పుడు విజయ్, సందీప్‌ఉన్న బిజీలో ఈ చిత్రం పట్టాలెక్కాలంటే చాలా సమయమే పడుతుంది. అయినా దీనికి కరెక్ట్ సీక్వెల్ పడితే మాత్రం మరో సంచలనం ఖాయంగా చెప్పవచ్చు.