Advertisement
Google Ads BL

రిలీజ్‌ డేట్‌ కన్‌ఫర్మ్‌ కాలేదట..!


తెలుగు కుర్రాడైన విశాల్‌ తమిళనాట హీరోగానే కాకుండా, మరీ ముఖ్యంగా మాస్‌ హీరోగా, నిర్మాతల మండలి అధ్యక్షునిగా, నడిగర్‌ సంఘంకి ప్రధాన కార్యదర్శిగా చాలా చురుకుగా ఉంటున్నాడు.ఇక ఈమధ్య తమిళనాట సమ్మెను ఆయన విజయవంతంగా ముందుకు నడిపించాడు. మన టాలీవుడ్‌ ప్రముఖులు మాత్రం రాజీపడి, తమను తాము తక్కువ చేసుకుని రాజీకి వస్తే, విశాల్‌ మాత్రం ఏమాత్రం భయపడకుండా సమ్మెను విజయవంతం చేసి తమకు అనుకూలంగా నిర్ణయాలు ఉండేలా చూసుకోవడంలో విజయం సాధించాడు. కేవలం విశాల్‌ మాట విని రజనీకాంత్‌ వంటి సూపర్‌స్టార్‌ తన 'కాలా'ను, కమల్‌హాసన్‌ 'విశ్వరూపం 2'ని పోస్ట్‌ పోన్‌ చేసుకున్నారంటే చిన్న విషయం కాదు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా విశాల్‌, సమంత హీరోయిన్‌గా మిత్రన్‌ అనే దర్శకునితో 'ఇరుంబుదిరై' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా 'అభిమన్యుడు' అనే పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సమ్మె వల్ల ముందుగా ఆగిపోయిన సినిమాలను వరుసగా రిలీజ్‌లకు ప్రాధాన్యం కల్పించేలా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపధ్యంలో విశాల్‌, సమంత చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మే 11న విడుదల కానుందని, 'మహానటి' సావిత్రిలో నటిస్తున్న సమంత మే9న రానుండగా, మే 11న ఆమె నటించిన 'అభిమన్యుడు' విడుదలై రెండురోజుల్లో రెండు రిలీజ్‌లు ఉంటాయని టాక్‌ మొదలైంది. 

దీనిపై విశాల్‌ స్పందించాడు. చిన్న కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వల్ల ఈ వార్తలు వచ్చాయి. నా చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్‌ చేయాలో ఇంకా నిర్ణయించలేదు. త్వరలోనే ఈచిత్రం విడుదల తేదీని ప్రకటిస్తానని విశాల్‌ స్పష్టం చేశాడు. 

Vishal Abhimanyudu Again Postponed:

Vishal about Abhimanyudu Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs