ఒకప్పుడు బాలీవుడ్ లో బయోపిక్ ల పరంపర కొనసాగింది. అక్కడ అనేక రకాల ప్రముఖుల బయోపిక్స్ ని తెరకెక్కించి బంపర్ హిట్స్ కొట్టారు. అదే హావా ప్రస్తుతం టాలీవుడ్ లో మొదలైంది. ప్రస్తుతం తెలుగులో 'మహానటి' సావిత్రి బయోపిక్ 'మహానటి' సినిమా వచ్చే నెలలోనే విడుదల కానుంది. ఇక మహోన్నత వ్యక్తి 'ఎన్టీఆర్' బయోపిక్ ని బాలకృష్ణ ఆఘమేఘాల మీద తేజ దర్శకత్వంలో తెరకెక్కించేస్తున్నాడు. అలాగే వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను మమ్ముట్టి హీరోగా 'యాత్ర'గా తెరకెక్కిస్తున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ కూడా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అంటూ హడావిడి చేసి ఇప్పుడు సౌండ్ చేయకుండా కూర్చున్నాడు.
అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్స్ పరంపర కొనసాగుతున్న టైం లో అక్కినేని నాగేశ్వర రావు జీవిత చరిత్రను ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్ లు రెండు కళ్ళు వంటివారు. మరి బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ ని 'ఎన్టీఆర్' గా మొదలు పెడితే... ఇప్పడు నాగార్జున కూడా తన తండ్రి అక్కినేని బయోపిక్ ని తెరకెక్కించే ఏర్పాట్లు తెర వెనుక మొదలెట్టినట్టుగా ఫిల్మ్ నగర్ టాక్. అక్కినేని చనిపోయే వరకు సినిమా ఇండస్ట్రీతో తన అనుబంధాన్ని పెనవేసుకుని వున్నాడు. ఆయన మరణించేటప్పటికీ అక్కినేని ఫ్యామిలీ చిత్రం 'మనం' ఇంకా సెట్స్ మీదే ఉంది. 'మనం' సినిమాలో నాగేశ్వర రావు చైతన్య పాత్ర పోషించాడు. మరి ఆయన మరణానంతరం ఇప్పుడు అయన బయోపిక్ పై చర్చ మొదలైంది.
అయితే గత ఆరునెలల నుండే అక్కినేని బయోపిక్ పై రీసెర్చ్ మొదలైందని... అది కాస్త ఇప్పుడు చివరి దశకు చేరుకొని పట్టాలెక్కేందుకు రెడీ అయ్యిందనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో స్ప్రెడ్ అయ్యింది. మరి అక్కినేని బయోపిక్ లో ఆయన వ్యక్తిగత జీవితం, నట జీవితం ఆఖరికి ఆయన అంతిమ యాత్ర వరకు ఉంటుందని కూడా చెబుతున్నారు. అయితే ఈ అక్కినేని బయోపిక్ లో యంగ్ అక్కినేనిగా చైతు, ఆ తర్వాత నాగ్ కనిపిస్తాడని టాక్ కూడా వినబడుతుంది. మరి ఇప్పటికే చైతు 'మహానటి' లో ఏఎన్నార్ పాత్ర పోషించాడు.