Advertisement
Google Ads BL

భరత్ టీం పార్టీ చేసుకుంటున్నారు..!


మహేష్ బాబు 'భరత్ అనే నేను' విజయంతో ఆనందంలో మునిగితేలుతున్నాడు. తేలడా మరి.... 'బ్రహ్మ్మోత్సవమ్, స్పైడర్' చిత్రాల ప్లాప్ తో డీలా పడ్డ మహేష్ కి 'భరత్ అనే నేను' విజయాన్నిఅందించి నెత్తి మీద పాలుపోసింది. రెండు డిజాస్టర్స్ తర్వాత వచ్చిన హిట్ తో మహేష్ కి ఎక్కడలేని హ్యాపీనెస్ వచ్చేసింది. అందుకే సినిమాకి ముందే ఫ్యామిలీతో విదేశాలకు చెక్కేసిన మహేష్.... సినిమా విడుదలయ్యాక తన భార్యతో గడిపిన ఆనందక్షణాలను ఒక పిక్ రూపంలో పోస్ట్ చేశాడు. ఆ పిక్ లో నమ్రతకి లిప్ కిస్ పెడుతున్న భర్త ఇప్పుడు కొరటాల అండ్ భరత్ టీమ్ తో కలిసి పార్టీ చేసుకున్నాడు.

Advertisement
CJ Advs

పార్టీ చేసుకున్నాడు కాదు.. తానే భరత్ టీమ్ కి ఒక పెద్ద పార్టీ ఇచ్చేశాడు. సినిమా మీదున్న కాన్ఫిడెన్స్ తో సినిమా విడుదలకు మునుపే భరత్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన చాలామందికి ఐ ఫోన్ 10 ని గిఫ్ట్ లుగా ఇచ్చిన మహేష్ బాబు ఇప్పుడు సినిమా విడుదలై విజయం సాధించాక 'భారత నే నేను' టీమ్ కి భారీ పార్టీ ఇచ్చేశాడు. ప్రస్తుతం 'భరత్ అనే నేను' నాన్ బాహుబలి రికార్డులను సృష్టిస్తూ అదరగొట్టే పెరఫార్మెన్స్ చేస్తుంది. అందుకే మహేష్ ఈ ఆనందంలో భరత్ టీమ్ కి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఇక ఈ పార్టీకి కొరటాలతో పాటు భరత్ టెక్నీకల్ టీమ్ మొత్తం పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమా విజయంతో ఫుల్ ఖుషీగా ఉన్న మహేష్ బాబు తన 25 వ చిత్రం కోసం రేడి అవుతున్నాడు. అయితే మహేష్, వంశి పైడిపల్లితో చెయ్యబోయే సినిమాలో పూజ హెగ్డే తో జోడి కడుతున్నాడు. ఇక ఈ సినిమా వచ్చే జూన్ నుండి పట్టాలెక్కే చాన్సు ఉంది.

Bharat Ane Nenu Team in Party Mood:

It's Party Time for Bharat Ane Nenu Team
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs