మోహన్‌బాబు, బాలకృష్ణ, చలపతిరావు వంటి వారు బూతులు తిట్టినా పట్టించుకోని మన సినీ పెద్దలు అదే మాట అన్న శ్రీరెడ్డిపై మాత్రం మండిపడుతున్నారు. ఇక శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పు అని ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ తాజాగా చంద్రబాబు ధర్మపోరాట దీక్ష సమయంలో బాలకృష్ణ మోదీని ఉద్దేశించి శ్రీరెడ్డి చేసినటువంటి బూతులే మాట్లాడాడు. కానీ మన సినిమా పెద్దలకు అది కనిపించదు. స్వయంగా నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనయునిగా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వియ్యంకునిగా, హిందూపురం ఎమ్మెల్యేగా, టాప్‌స్టార్‌గా ఉన్న బాలకృష్ణ గతంలో కూడా ఆడవారికి కడుపు చేయమని చెప్పాడు. ఇక ధర్మపోరాట దీక్షలో ఆయన రాయలేని బూతును మాట్లాడాడు.
ఇక పవన్ తాను మీడియాపై యుద్దం అని ప్రకటించాడు. దీని వల్ల ఆయనకే నష్టం కానీ ఆయన కాకపోతే మరొకరితో మీడియా నడుస్తోంది. వ్యక్తులు ముఖ్యంగా కాదు. జర్నలిజమే ముఖ్యమని భావించే నిజమైన జర్నలిస్ట్‌లు కూడా సమాజంలో ఉన్నారు. కానీ అందరినీ ఒకే గాటికి కట్టి పవన్ ఆరోపణలు చేయడం సమర్ధనీయం కాదు. ఇక ఇండస్ట్రీ పెద్దగా, సినీ రంగంలో ఇప్పుడున్న సీనియర్లలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ పవన్‌ని ఆయన ఫిల్మ్‌చాంబర్‌కి వచ్చినప్పుడు కలిశాడట. ఆ విషయాన్ని పరుచూరినే చెబుతూ, పవన్ తనకు ఉన్న గన్‌మెన్‌లను వద్దని తిరిగిపంపిన విషయంపై తాను ట్వీట్ చేశానని, ఈ ట్వీట్‌ని పవన్‌కి చూపిస్తే సభల్లో ప్రసంగాలలో వలే ఆయన నవ్వుతు స్మైల్ ఇచ్చాడని పరుచూరి మురిసిపోతున్నాడు. ఇక పవన్ తన ట్వీట్‌ని చూసి నవ్వుతూ, కరచాలనం చేశాడని, న్యాయపోరాటానికి ముందడుగు వేయ్ పవన్ కళ్యాణ్...నీ వెనుక జనశక్తి ఉంది...అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక గోపాలకృష్ణ గన్‌మెన్‌లను ఉద్దేశించి చేసిన ట్వీట్ ఏమిటంటే.. పవన్ ప్రభుత్వం తనకి ఇచ్చిన 2ప్లస్ 2 గన్‌మెన్‌లను వద్దనుకున్నారు. ప్రతి జన సైనికుడు తనకు ఓ గన్‌మెనే కదా...! దమ్ముతో దుమ్ము దులిపే వారు వెనక్కి చూడరు. వెనుక వైపు చూసుకోవడానికి వెనుక జనసైన్యం ఉంది. ఆ పక్క ఈ పక్క వామపక్షాలున్నాయి. ప్రశ్నించడమే గెలుపుగా సాగిపో...అంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి భజన పరుల మాటలు వినే పవన్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఏకాకి అవుతున్నాడన్న విషయం భజన బ్యాచ్‌ని నమ్మే పవన్‌కి తెలియకుండానే ఆయన పేరు బద్‌నాం అవుతోంది.