Advertisement
Google Ads BL

కాస్టింగ్‌కౌచ్‌పై ఆదా స్పందన ఇది!


హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకు కాస్టింగ్‌కౌచ్‌పై అట్టుడుకుతోంది. ఇక శ్రీరెడ్డి, మాధవీలత, అపూర్వ, పూనమ్‌కౌర్‌, జీవిత వంటి వారి కారణంగా ఇది టాలీవుడ్‌లో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. దీనిపై రాంగోపాల్‌వర్మ తానే శ్రీరెడ్డిని ఈ వివాదంలోకి పవన్‌ని లాగమని చెప్పానని ఒప్పుకోవడంతో వర్మపై ఆయన ప్రియశిష్యుడు పూరీజగన్నాథ్‌ నుంచి పలువురు గుర్రుగా ఉన్నారు. వర్మ నటించే చిత్రాలను రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మూకుమ్మడిగా బహిష్కరించేలా 'మా, ఫిల్మ్‌చాంబర్‌'ల చర్యలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక కాస్టింగ్‌కౌచ్‌పై పలువురు హీరోయిన్లు పలు రకాలైన వాదనలు వినిపించిన తర్వాత తాజాగా టాలీవుడ్‌, బాలీవుడ్‌ నటి ఆదాశర్మ కూడా కాస్టింగ్‌కౌచ్‌పై స్పందించింది. 

Advertisement
CJ Advs

కాస్టింగ్‌కౌచ్‌ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. సెక్సవల్‌గా దర్శకనిర్మాతలకు, ఇతరులకు ఫేవర్‌ చేయాలా? కమిట్‌మెంట్స్‌కి ఒప్పుకోవాలా? అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. పనికోసం కొందరు లైంగిక సుఖం ఇవ్వడానికి కూడా వెనుకాడటం లేదు. ఇది కేవలం సినీరంగంలోనే కాదు అన్నిరంగాలలోనూ ఉందని ఆమె తేల్చిచెప్పింది. అయితే మహిళలను లైంగికంగా ఒత్తిడి చేయడం, బలవంతం చేయడం మాత్రం తప్పు. వారు ఇష్టపడే దానికి ఒప్పుకుంటే దానికి మనమేం చేయలేం. కానీ ఇష్టం లేని వారిని కూడా బలవంతం చేయడం మానభంగం కిందకే వస్తుంది. నాకు మాత్రం ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. 

ఇక దక్షిణాది, బాలీవుడ్‌ చిత్రాల విషయంలో తేడాకి వస్తే దక్షిణాదిలో ఒక చిత్రం హిట్టయిన వెంటనే వరుస చాన్స్‌లు వస్తాయి. ఇలా చూసుకుంటే బాలీవుడ్‌ కంటే అవకాశాలు సంపాదించడం దక్షిణాదిలోనే తేలిక. కానీ బాలీవుడ్‌లో మాత్రం అవకాశాలు ఎలా సంపాదించాలో అర్దం కావడం లేదని చెప్పింది. 

ఇక కాస్టింగ్‌కౌచ్‌ విషయంతోపాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలు సమస్యలపై విచారణ జరిపినందుకు నాగార్జున మేనకోడలు, ఏయన్నార్‌ మనవరాలు యార్లగడ్డ సుప్రియ ఆధ్వర్యంలో ఓ జేఏసీని నియమించారు. ఇందులో 24క్రాఫ్ట్‌కి చెందిన పలువురు ప్రముఖులు ఉంటారు. ఇక కాస్టింగ్‌కౌచ్‌పై విచారణ జరిపేందుకు కూడా ఓ క్యాష్‌ కమిటీనీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో కూడా సినిమా ప్రముఖులు సగం మంది ఉంటే, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, న్యాయవాదులు ఈ కమిటీలో ఉండనున్నారు. 

Adah Sharma About Casting Couch:

Actress Adah Sharma Reveals Shocking Facts about Casting Couch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs