Advertisement
Google Ads BL

ఒక వైపు ఆనందం.. మరోవైపు బాధ..!


పవన్‌కళ్యాణ్‌ విషయంలో శ్రీరెడ్డి మాట్లాడిన బూతు మాటల తర్వాత తెలుగు ఇండస్ట్రీలో సెగలు ఎక్కువయ్యాయి. తన తల్లిని అసభ్య పదజాలంతో దూషించిన శ్రీరెడ్డి వ్యవహారం, ఇందులో మీడియా చూపిస్తున్న అత్యుత్సాహంపై పవన్‌ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. పనిలో పనిగా మీడియాకు అధిపతులనైన వారిని పేర్లను చెబుతూ, మీడియాపై ప్రత్యక్ష పోరాటానికి దిగాడు. ఇలా ఏకంగా పవన్‌ మీడియాను టార్గెట్‌ చేయడంతో పాటు తల్లిని అంత మాట అనిన తర్వాత ఇక తాను బతికుండి లాభం లేదని పవన్‌ వాపోయాడు.

Advertisement
CJ Advs

మరోవైపు నిన్ననే వచ్చిన 'భరత్‌ అనే నేను' చిత్రంలోని ఓ సీన్‌లో మహేష్‌ మీడియాని టార్గెట్‌ చేయడం యాదృచ్చికమే అయినా ఖచ్చితంగా పవన్‌ తల్లి మీద బూతులు ప్రయోగించి, వాటిని హైలైట్‌ చేసిన విధంగానే 'భరత్‌ అనే నేను'లో సీఎం మహేష్‌ ఓ అమ్మాయితో క్లోజ్‌గా ఉండటం చూసి పెంటహౌజ్‌లో సీఎం రాసలీలలు అనే వార్తలు మీడియాలో వస్తాయి. దాని గురించి మహేష్‌ ఓపెన్‌గానే మీడియాను నిలదీస్తాడు. ఆ వార్త రాసిన జర్నలిస్ట్‌తో నీవు రాసిన స్థానంలో నీ అక్కో చెల్లో ఉంటే ఇలాగే రాస్తావా? అని మండి పడతాడు. ఈ డైలాగ్స్‌ పవన్‌కి ఆయన ఫ్యాన్స్‌కి నిజంగానే ఊరట నిచ్చేవిషయాలే.

ఇక నిన్న మహేష్‌ తల్లి ఇందిరాదేవి పుట్టినరోజు సందర్భంగా తన 'భరత్‌ అనే నేను' హిట్‌ అయిన నేపధ్యంలో మహేష్‌ తన తల్లి ఫొటోని పోస్ట్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. అదే సమయంలో పవన్‌ తన తల్లిని బూతులు తిట్టిన శ్రీరెడ్డి, మీడియాపై మండిపడ్డాడు.

Mahesh Babu Emotional Tweet on his Mother Birthday:

Pawan Kalyan sits on Deeksha with his Mother
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs