Advertisement
Google Ads BL

వర్మ మాత్రం తగ్గడం లేదుగా..!


ఒక పక్క రాంగోపాల్‌వర్మ ప్రోద్భలంతోనే శ్రీరెడ్డి పవన్‌ని, ఆయన తల్లిని అసభ్య పదజాలంతో తిట్టినట్లు స్వయంగా రాంగోపాల్‌వర్మనే పేర్కొన్నాడు. తన కెరీర్‌లో ఇప్పటి వరకు తాను ఇన్ని సారీలు ఎవ్వరికీ చెప్పలేదని చెప్పిన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిల్మ్‌ చాంబర్‌ని మెగా క్యాంపు ఒత్తిడి చేస్తోంది. ఇక వర్మపై మండిపడిన అల్లు అరవింద్‌ ప్రతి ప్రశ్నకు వర్మ లాజిక్‌గా సమాధానాలు ఇచ్చాడు. ఇక తాను తప్పు చేశానని, మరోసారి పవన్‌ని ఉద్దేశించి నెగిటివ్‌ ట్వీట్స్‌ చేయనని చెప్పిన ఆయన తన తల్లి మీద ఒట్టు. ఇకపై పవన్‌ని ఏమీ అనను అని తెలిపాడు. తన ఒట్టును గట్టు మీద పెడుతున్నానని, పవన్‌ కళ్యాణ్‌ తనని ఉద్దేశించి ట్వీట్స్‌ చేయడంతో తన తల్లి పర్మిషన్‌తో తాను ఒట్టు తీసి గట్టున పెడుతున్నానని చెప్పాడు. 

Advertisement
CJ Advs

ఒకవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా మీద దీక్ష చేస్తున్నరోజునే, మరోపక్క 'భరత్‌ అనే నేను' చిత్రం రిలీజ్‌ సమయంలోనే వాటిని తప్పుదారి పట్టించాలని పవన్‌ ఇలా ప్రవర్తించాడని దెప్పి పొడిచాడు. ఏపీకి ప్రత్యేకహోదా కంటే ఎవరో ఆఫ్ట్రాల్‌ వ్యక్తి తిట్టారనేదే మీకు జాతీయ సమస్యగా కనిపించిందా? మీరు చెప్పిన పేర్లలో వారందరూ మూకుమ్మడి ముఠా అయితే అయి ఉండవచ్చు. నాకు తెలియదు. కానీ నా విషయంలో వారికేమీ సంబంధం లేదని వర్మ పేర్కొన్నాడు. శ్రీరెడ్డి పవన్‌ తల్లిపై చేసిన వ్యాఖ్యలను పలువురు విరివిగా వాడుతున్నారని దానిని తప్పుగా తీసుకోవద్దు. మీకు అదే మీ జీవితంలో ఘోరమైన తిట్టు అనిపిస్తే సోషల్‌ మీడియాలో మీ ఫ్యాన్స్‌ తిట్టేతిట్లు వింటే మీరు మూర్చబోతారు. ఇలా చెప్పినవన్నీ చెబుతూనే 20వ సారి సారీ చెబుతున్నానన్నాడు. 

ఇక పవన్‌ తల్లి విషయంలో శ్రీరెడ్డి మాట్లాడింది తప్పే అని ఒప్పుకున్నా ఇంతకు మించిన బూతులను పవన్‌ ఫ్యాన్స్‌ తమ వ్యతిరేకులపై వాడుతున్న విషయం పవన్‌ గుర్తుంచుకోవాలి. అమ్మ ఎవరికైనా అమ్మే. మరి పవన్‌ని చిన్న విమర్శ చేసినా ఆయన ఫ్యాన్స్‌ అమ్మలక్కలు తిట్టడం ఏమాత్రం సమంజసమైనది తేలాల్సివుంది...!

Pawan kalyan Vs Ram gopal Varma:

RGV Counters on Pawan kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs