'జబర్ధస్థ్' ద్వారా పాపులర్ అయిన కమెడియన్ మహేష్. ఈయన 'రంగస్థలం' చిత్రంలో తనదైన నటనతో అదరగొట్టాడు. ఈ చిత్రం ఆయనకి ఎంతో పేరును, గుర్తింపుని తెచ్చిపెట్టింది. బక్కపలచగా, పొడుగ్గా, విభిన్నమైన బాడీలాంగ్వేజ్, తనదైన శైలిలో డైలాగ్స్ చెప్పే ఆయన ప్రేక్షకులను 'రంగస్థలం'లో ఎంతో నవ్వించాడు. ఇక ఏముంది? రాత్రికి రాత్రి ఈయన పాపులర్ అయి, సెలబ్రిటీ హోదాను మరింతగా పెంచుకున్నాడు.
ఇక విషయానికి వస్తే మహేష్‌ని మీకు ఇప్పటి వరకు మర్చిపోలేదని కాంప్లిమెంట్ ఏమైనా ఉందా? అని అడిగితే ఉంది... అని చెప్పాడు. 'రంగస్థలం' చిత్రం చూసి మహేష్‌బాబు గారు సుకుమార్‌కి ఫోన్ చేసి అభినందించి, ఆ అబ్బాయ్ కూడా భలే చేశాడు. మీరు వచ్చేటప్పుడు అతనిని కూడా తీసుకుని రండి అని చెప్పాడట. ఇక ఈ చిత్ర నిర్మాతలు కూడా మహేష్‌ని కలిసినప్పుడు కూడా మహేష్ మరోసారి గుర్తు పెట్టుకుని ఆ కమెడియన్‌ని తీసుకుని రాలేదా? అని అడిగాడు. మహేష్ గారు నా నటన మెచ్చుకుంటూ ఇచ్చిన ఈ కాంప్లిమెంట్స్‌ని నేను మర్చిపోలేను అని తెలిపాడు.
ఇక 'పెళ్లిచూపులు' చిత్రంలో నటించిన కమెడియన్ ప్రియదర్శికి 'స్పైడర్'లో మహేష్‌బాబు అవకాశం ఇచ్చినట్లుగా, మహేష్‌కి కూడా సూపర్‌స్టార్ మహేష్ తన తదుపరి చిత్రాలలో ఆయనకేమైనా మంచి రోల్ ఇస్తాడేమో వేచిచూడాల్సివుంది...! ఇక ప్రస్తుతం జబర్ధస్త్ మహేష్‌కి సినిమా నటునిగా కూడా, కమెడియన్‌గా మంచి మంచి వేషాలు వస్తున్నాయని అంటున్నారు.