Advertisement
Google Ads BL

కరాటే కళ్యాణి ఇది కరెక్ట్ కాదు..!


 

Advertisement
CJ Advs

శ్రీరెడ్ది వివాదం మీడియా సృష్టించింది కాదు. ఇండస్ట్రీలోని శ్రీరెడ్డి వంటి వారే మీడియా ముందుకు వచ్చారు. దానికి కత్తిమహేష్‌తో పాటు మాధవీలత, పూనమ్‌కౌర్‌, అపూర్వ, శ్రీరెడ్డి వంటి వారే వచ్చి ఇండస్ట్రీ పరువును తీశారు. మిగిలిన పరువును 'మా' తీసివేసింది. ఇక్కడ కేవలం మీడియా ఏమి చేసిందంటే శ్రీరెడ్డి మాటలను చూపిస్తూ, ఇండస్ట్రీలోని పలు అంశాలపై డిబేట్స్‌ నిర్వహించింది. ఇది మీడియా కనీస బాధ్యత. గతంలో కూడా పవన్‌కళ్యాణ్‌.. చిరంజీవి కూతురు నిశ్చితార్ధం సందర్భంగా ఓ ఫొటో జర్నలిస్ట్‌పై దాడి చేశాడు. ఇక కాస్టింగ్‌కౌచ్‌ అనేది ఏమీ మీడియా సృష్టించింది కాదు. పవన్‌కి మాట్లాడేటప్పుడు కవరేజ్‌ ఇచ్చినట్లే శ్రీరెడ్డి మాటలకు కూడా కవరేజ్‌ ఇచ్చింది. 

ఇక లైవ్‌లో ఆమె అలాంటి బూతులు వాడటం తప్పేనని తెలిసినా, కూడా న్యూసెన్స్‌ని క్రియేట్‌ చేయకూడదు. న్యూసెన్స్‌ వస్తే దానిని వదిలేయడం కూడా తప్పేనని చెప్పాలి. కాబట్టే శ్రీరెడ్డి విషయంలో ఇంత రగడ జరిగింది. కానీ మీడియా తీరు వల్లే ఈ గొడవ వచ్చిందని, కేవలం కొందరు మీడియా అధినేతలు, లోకేష్‌, ఆయన స్నేహితులు కలిసి ఇది చేస్తున్నారని, పవన్‌ నుంచి హేమ, జీవిత వరకు మీడియాని టార్గెట్‌ చేయడం సరికాదు. మీడియా మీద మీకు నమ్మకం లేకపోతే అసలు మీరు మీడియా ముందుకే రాకుండా ఉండటం మంచిది. ఇక మీడియా అవసరం మాకు లేదు అనుకున్నప్పుడు ఫలానా సమయంలో మాట్లాడుతున్నాం.. ప్రెస్‌మీట్‌ పెడుతున్నాం.. అని ప్రెస్‌ వారిని పిలవడం ఎందుకు? 

ఇక విషయానికి వస్తే ఇండస్ట్రీకి సపోర్ట్‌గా మాట్లాడుతూ.. శ్రీరెడ్డి వాదనను తిప్పికొట్టి, మీడియా లైవ్‌లోనే కరాటే కళ్యాణి శ్రీరెడ్డిపై చేయిచేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆమె శ్రీరెడ్డికి చెందిన కారు, అపార్ట్‌మెంట్‌, గృహప్రవేశం  నాడు తన తల్లి కూతుర్లతో ఉన్న ఫొటోలను విడుదల చేసింది. మీకు మీకు గొడవలుంటే వీధిలో పిచ్చివారిలా తిట్టుకుని కొట్టుకోండి. అంతేగానీ శ్రీరెడ్డి పవన్‌ విషయంలో ఆయన మీద బూతులు వాడినట్లుగా శ్రీరెడ్డి కూతురి ఫొటోను ఇలా కరాటే కళ్యాణి పోస్ట్‌ చేసి ఆ యువతి జీవితంలో ఆడుకోవడం సరికాదు. మీరు మీరు ఏమైనా చేసుకోండి గానీ ఇలా ఆమె కూతురు ఫొటోలను లీక్‌ చేసి ఎదురుదాడికి దిగితే ఏమీ తెలియని ఆ పాప జీవితం అంధకారం అయిపోతుందనే చెప్పాలి. 

Karate Kalyani Leaks Actress Sri Reddy Personal Pics:

After SriLeaks, Karate Kalyani Leaks Rocks Tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs