సినిమా వారు లక్షల్లో, కోట్లలో తేలి పోతు ఉంటారనేది నిజమే కానీ సినిమా వారిలో చాలా మందిపై అనేక ఆర్దిక ఆరోపణలు, భాను వంటి వారితో చేతులు కలపడం, చెక్‌బౌన్స్ కేసులు సినిమా వారిపై కోకొల్లలు. ఇక నాడు తేజ చిత్రాల ద్వారా పేరు తెచ్చుకున్న పాటల రచయిత కులశేఖర్ మతిస్థిమితం కోల్పోయి ఓ గుడిలో వెండి వస్తువులను దొంగిలించాడన్న నేరంపై అరెస్ట్ కూడా అయ్యాడు.
ఇక తాజాగా దర్శకుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చి 'ఉయ్యాల జంపాల'తో సడన్‌గా హీరో అయి, ఆ తర్వాత కూడా 'సినిమా చూపిస్త మావా, కుమారి 21 ఎఫ్, ఆడోరకం ఈడోరకం' వంటి హిట్స్‌ని తన ఖాతాలో వేసుకున్న హీరో రాజ్‌తరుణ్. కానీ ఆయనకు గత కొంతకాలంగా హిట్స్‌లేవు. ఇటీవల వచ్చిన 'రంగుల రాట్నం' కూడా డిజాస్టర్‌గా నిలిచింది. ఇక 'రాజుగాడు' చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అలాంటి రాజ్‌తరుణ్ తండ్రి బసవరాజుకి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, 20వేలు జరిమానా విధించింది. బ్యాంకు ఉద్యోగి అయిన బసవరాజు నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి, రుణం తీసుకున్న కేసులో కోర్టు ఆయనకు ఈ శిక్ష విధించింది.
విశాఖపట్టణం వేపగుంటకి చెందిన బసవరాజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింహాచలం బ్రాంచ్‌లో అసిస్టెంట్ క్యాషియర్‌గా పనిచేసేవాడు. 2013లో తన భార్య రాజ్యలక్ష్మి పేరుతో పాటు ఎం.ఎస్.ఎన్‌రాజు, సన్నాసి రాజు, సాంబమూర్తి వెంకట్రావ్‌ల పేర్ల మీద నకిలి బంగారాన్ని తాకట్టు పెట్టి, 9.85లక్షల లోన్ తీసుకున్నాడు. బ్యాంకు అధికారుల తనిఖీలలో నకిలీ బంగారం బయటపడటంతో మేనేజర్ గరికపాటి సుబ్రహ్మణ్యం, బసవరాజుపై గోపాల పట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ఈ విషయంలో కోర్టు తీర్పు ఇస్తూ రాజ్‌తరుణ్ తండ్రికి మూడేళ్ల జైలు శిక్ష, 20వేలు జరిమానా విధించారు.