సూపర్ స్టార్ రజినీకాంత్ కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది. అటు సినిమాల పరంగాను, ఇటు రాజకీయాల పరంగాను సేమ్ టు సేమ్ అన్నట్టుగా వుంది పరిస్థితి. రాజకీయాల్లోనూ అనుకున్నట్టుగా సక్సెస్ కాలేకపోతున్న రజినీకాంత్ సినిమాలు విడుదల కూడా పోస్ట్ పోన్ ల మీద పోస్ట్ పోన్స్ అవుతూ ఆయన్ని ఇరకాటంలో పెట్టేస్తున్నాయి. మొన్నటికి మొన్న రోబో 2 .ఓ సినిమా అదిగో విడుదల అంటే...... ఇదిగో విడుదల అన్నారు. కానీ ఆ సినిమా గ్రాఫిక్స్ లేట్ వలన అసలు రోబో 2 .ఓ ఎప్పుడు విడుదలవుతుందో అనేది క్లారిటీ లేకుండా పోయింది. అలాగే రేపు 27 నే విడుదల కావాల్సిన 'కాలా' కూడా అంతే.
గత నెలన్నరగా కోలీవుడ్ లో థియేటర్స్ బంద్ నడుస్తుండడంతో... రజినీకాంత్ - రంజిత్ పాల సినిమా కాలా సినిమా ఈ నెల 27 న విడుదల వ ఉంటుందో లేదో అనుకున్నారు. అయితే మొదట్లో ఆగష్టు 15 కి అన్నా కూడా రోబో 2 .ఓ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు.. అందుకే కాలా సినిమా నిర్మాత కాలా ని ఏప్రిల్ 27 కి ప్రీ పోన్ చేశాడు. కానీ కోలీవుడ్ లో థియేటర్స్ బంద్ వలన రేపు 27 న విడుదల కావాల్సిన కాలా కాస్తా వాయిదా పడింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు అంటే సెన్సార్ కార్య్రక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదల కోసం వెయిట్ చేస్తున్న 'కాలా' ఇప్పుడు తాజాగా జూన్ 7 కి వెళ్ళిపోయింది.
ఇంతకు ముందే 'కాలా' నిర్మాత ధనుష్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. మరి రేఫు 27 న కాలా విడుదల ఉంటుందనుకుని తెలుగు హీరోలు మాములుగా టెన్షన్ పడలేదు. అందులో మహేష్, అల్లు అర్జున్ లు తమ సినిమాల విషయంలో కాలా కనుక ఈ 27 న విడుదలైతే తమ సినిమాల కలెక్షన్స్ పడిపోతాయని కంగారు పడ్డారు. కానీ 'కాలా' విడుదల అలా అనుకోకుండా జూన్ 7 కి షిఫ్ట్ అయ్యింది. ఇక సూపర్ స్టార్ అభిమానులు కాలా కోసం మరో నెలన్నర వెయిట్ చెయ్యాల్సిందే. కానీ ఇక్కడ అల్లు అర్జున్ అండ్ మహేష్ బాబులు ఫుల్ హ్యాపీ అన్నమాట.