ఇటీవల జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుదు తనయుడు, మంత్రి లోకేష్ అవినీతి పరాకాష్టకు చేరుకుందని వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. దాంతో టిడిపి వారు అవినీతికి నీ వద్ద ఆధారాలు ఉంటే చూపమని డిమాండ్ చేశారు. ప్రతి దానికి ఆధారాలు ఇవ్వలేమని, తనకు తెలిసి లోకేష్ చేస్తున్న అవినీతి జగమెరిగిన సత్యమని, అది అందరి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని ఇటీవల ఆయన్ను కలసిన వామపక్ష నాయకులతో కూడా అన్నాడట. ఇక తాజాగా పవన్ సెక్రటేరియట్ సాక్షిగా తనపై మంత్రి లోకేష్, ఆయన స్నేహితులు, వారికి బాగా క్లోజ్ అయిన మీడియా అధిపతులతో కలిసి నన్ను బజారు కీడ్చడానికి ట్రై చేస్తున్నారు. ఈ విషయం చంద్రబాబుకి తెలియకుండానే జరుగుతోందా? మీడియా పెద్దలతో కలిసి నాపై లోకేష్, అతని స్నేహితులు మీడియా అత్యాచారం చేశారని పవన్ విమర్శించాడు. ఇక దీనికి తాజాగా నారా లోకేష్ స్పందించాడు.
ఈమేరకు ఆయన పలు ట్వీట్స్ చేశాడు. పవన్‌కళ్యాణ్‌గారు.. మీ వ్యాఖ్యలు నన్ను బాగా బాధించాయి. ఇంతకు ముందు కూడా మీరు నాపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఎవరో చెబితే అన్నానని చెప్పారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎన్నో ఏళ్ల శ్రమ ఫలితం. ఎవరో అన్న, విన్న మాటలను పట్టించుకుని విమర్శించే కుసంస్కారిని నేను కాను. వాస్తవాలన్నింటినీ కాలమే ప్రజల ముందు ఉంచుతుంది. ఇప్పటికీ మీ పట్ల నాకు హృదయంలో గౌరవనీయమైన స్థానమే ఉంది. ఉంటుంది. మాతృదేవోభవ: అని లోకేష్ చెప్పుకొచ్చాడు.
ఇక పవన్ రాజకీయాలలోకి ప్రవేశించినా ఇంకా ఆయన హీరోగానే ఫీలవుతున్నారని, ప్రజా క్షేత్రంలోకి అందునా రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఆవేశం అంత పనికి రాదని, పవన్ మీడియా అంతటిపై ఇలా నిందలు వేసి, ఆయన అభిమానులు చేత బన్నీవాస్ వంటి వారు యుద్దానికి సిద్దం. తాట తీస్తాం అనడం తప్పని, ఎవరి తాట ఎందుకు తీస్తారు? మీరు ఫలానా చానెల్స్‌ని చూడవద్దని చెప్పినట్లు మీడియా కూడా పవన్ సినిమాలు చూడవద్దు అంటే మీకెలా ఉంటుందో ఆలోచించమని మీడియాలోని నిజాయితీ పరులు పవన్‌కి సలహ ఇస్తున్నారు.