మన సమాజంలో రౌడీయిజం, గూండాయిజం, టెర్రరిజం, నక్సలిజం, కమ్యూనిజం వంటివి ఎన్నో ఇజాలు ఉన్నాయి. వీటన్నింటిలో రౌడీయిజం కంటే కూడా పూర్తిగా చెడిపోయిన ఇజం జర్నలిజం. ఇప్పుడ ఉన్న వారికి సర్క్యులేషన్, ప్రభుత్వాలు, నాయకులు ఇచ్చే ఆదాయ వనరులు తప్పితే ఏమాత్రం జర్నలిజంపై అవగాహనలేదు. దాంతోనే పాత తరానికి చెందిన పలువురు జర్నలిస్ట్‌లు ఈ తప్పుడు పనులు చేయలేక మీడియాలోజర్నలిజం వృత్తిని వదిలేసి, తమ మానాన తాము ఏదో పని చేసుకుని బతుకుతున్నారు. నేడు నిజంగా సంస్థకు ప్యాకేజీలు తెచ్చేవారు. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేసి తాము సంపాదించుకుంటూ, యాజమాన్యానికి కూడా ఆదాయం చూపించే వారే జర్నలిస్ట్‌లుగా వెలిగిపోతున్నారు. అందుకే అందరు ఇప్పుడున్న జర్నలిజాన్ని వ్యభిచారం, వేశ్యలతో పోలుస్తున్నారు. తనకి డబ్బు ఇచ్చిన వారిని సుఖ పెట్టే వేశ్యకంటే హీనంగా నేటి జర్నలిస్ట్‌లు ఉన్నారు. దీనికి కారణం వేగంగా విలువలు పతనం కావడం, మీడియాలోకి పెట్టుబడిదారులు, పలు పార్టీల వారు, రెండు మూడుకులాల వారి చేతిలో మీడియా బంధీగా మారడమే కారణం.
ఇక ఈ చానెల్స్ వారు బ్రాహ్మణులను వెక్కిరించిన, వైశ్యులను వేశ్యలతో పోల్చినా స్పందించరు గానీ టీఆర్పీ వస్తుందంటే చాలు తమ వరకు వచ్చే సరికి మాత్రం రెచ్చిపోతూ ఉంటారు. ఇక నేడు ఏ పార్టీ వారికైనా సొంత మీడియా లేనిదే రాజకీయాలలో రాణించలేని పరిస్థితి. నాడు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా ప్రతి మీడియా ఆయన్ను టార్గెట్ చేసిందేగానీ నీచమైన ఆరోపణలను చెక్‌పెట్టే పనిచేయలేదు. నాడు చిరంజీవి సొంతగా మీడియాను స్థాపించడమో, కొన్ని పత్రికలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూడటమో చేయలేదు. ఇప్పుడు పవన్ విషయంలో కూడా మీడియా ఆయన్ను, ఆయనతల్లిని తిట్టిన వాటిని పదే పదే చూపి పవన్ పరువును తీసేలా కార్యక్రమాలు చేశారు. దీనిపై స్పందించిన పవన్ మీడియాను కూడా వదిలిపెట్ట లేదు.
మీడియా ధనిక, శక్తివంతమైనదిగా అభివర్ణిస్తూ, మా తల్లిని అసభ్యపదజాలంలో తిడితే చూపించిందే చూపించారు. విశ్లేషణలు, డిబేట్స్ నిర్వహించారు. అదే చంద్రబాబు, లోకేష్, ప్రతిపక్ష నాయకులు తల్లులపై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తే మీరు అదే పనిగా చూపించేవారా? కనీసం బాలకృష్ణ తల్లిని అలా అన్నా కూడా మీరు అలా నిరంతరం అదే విషయాన్ని ప్రసారం చేసేవారా? ఇప్పుడు చెప్పండి ధనిక, మీడియా శక్తలారా? పవన్‌కే ఈ ప్రత్యేకమైనా ట్రీట్‌మెంట్ ఎందుకు అని పవన్ ప్రశ్నించాడు.