Advertisement
Google Ads BL

'భరత్'కు అన్యాయం జరుగుతుంది..!


మహేష్ బాబు తాజా చిత్రం 'భరత్ అనే నేను' భారీగా థియేటర్స్ లోకి అడుగుపెట్టేసింది. సినిమా మీద భారీ నుంచి అతి భారీ అంచనాలున్నాయి. మహేష్ బాబు - కొరటాల క్రేజీ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాపై అటు ఫాన్స్ లోను ఇటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలున్నాయి. మరి ఇలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన 'భరత్ అనే నేను' విజయానికి రెండు శక్తులు అడ్డంకులుగా మారాయి. సినిమా ప్రీమియర్ టాక్ పాజిటివ్ గానే ఉంది కానీ... ప్రస్తుతం ఛానల్స్ లో ఎక్కడా మహేష్ బాబు 'భరత్ అనే నేను' హంగామా ఎక్కడ కనబడడం లేదు. ఈ మధ్య కాలంలో ఒక పెద్ద సినిమా విడుదలవుతుంది అంటే చాలు పలు ఛానల్స్ వారు ఆ సినిమాపై విడుదలయిన థియేటర్స్ దగ్గర హంగామా చేస్తూ అభిమానుల ఇంటర్వ్యూ లు చేస్తూ ఆ సినిమా పై అందరిలో ఆసక్తి కలిగేలా చేసేవారు. కానీ ప్రస్తుతం అన్ని ఛానల్స్ లో మహేష్ 'భరత్ అనే నేను' హంగామాని పక్కన పెట్టేసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు అయిన ఈ రోజు ఆయన చేస్తున్న 'ధర్మ పోరాట దీక్ష' పై ఫోకస్ పెట్టాయి.

Advertisement
CJ Advs

చంద్రబాబుకి అందరూ పుట్టినరోజు గ్రీటింగ్స్ తెలుపుతూ ఆయన దీక్ష శిబిరానికి చేరుకుంటున్నారు. అలాగే ఆయన ధర్మ పోరాట దీక్ష కి పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. మరి ఏకధాటిగా బాబు దీక్షనే హైలెట్ చేస్తూ ఛానల్స్ మహేష్ 'భరత్ అనే నేను' ని లైట్ తీసుకున్నాయి. ఇక నిన్న, మొన్న శ్రీ రెడ్డి, రామ్ గోపాల్ వర్మ ల విషయాలతో టివి ఛానల్స్ అన్ని బాగా బిజీగా వున్నాయి. గత రెండు రోజుల నుండి 'భరత్ అనే నేను' ప్రమోషన్స్ ఎంత పీక్స్ కి తీసుకెళ్లినా ఛానల్స్, వెబ్ మీడియా మొత్తం శ్రీ రెడ్డి, వర్మ ల మీద ఫోకస్ చేసి భరత్ ని పక్కన పెట్టేశాయి. కొన్ని ఛానల్స్ లో అయితే 'భరత్ అనే నేను' యాడ్ కింద బాక్స్ లో ఉంటె... పైన మాత్రం బాబు 'ధర్మ పోరాట దీక్ష' అనే టాప్ న్యూస్, అలాగే శ్రీ రెడ్డి ఇష్యు అబ్బో ఇలా 'భరత్ అనే నేను' సినిమాపై ఉండాల్సిన ఛానల్స్ ఫోకస్ కాస్తా ఇతర విషయాలపై మళ్లింది. మరి ఈ రెండు విషయాలతో భరత్ కి డ్యామేజ్ ఎమన్నా జరుగుతుందో లేదో అనేది భరత్ విజయం మీద ఆధారపడి ఉంటుంది. చూద్దాం ఫైనల్ గా 'భరత్ అనే నేను' హిట్ లేదా అనేది.

Bharat Ane Nenu Movie Released:

No Media Focus on Bharat Ane Nenu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs