Advertisement
Google Ads BL

ప్రతి మూవీ హిట్‌ కావాలనే చేస్తాం: మహేష్!


నా గత రెండు చిత్రాలు సరిగా ఆడలేదు. ప్రతి సినిమాని బాగా హిట్‌ కావాలనే చేస్తాం. కానీ 'భరత్‌ అనే నేను' చిత్రం విషయంలో మాత్రం నాకెంతో నమ్మకంగా పాజిటివ్‌ బజ్‌ ఉంది. ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఐదు గంటలు సమయం పట్టింది. ఇందులోని కొన్నిసీన్స్‌ని తీయలేకపోయాం. అవ్వన్నీ తీయాలంటే రెండు పార్ట్‌లుగా చేస్తే గానీ వీలుకాదు. సినిమా స్టార్టింగ్‌ పది నిమిషాలు కాకుండా మిగిలిన చిత్రం అంతా సీఎంగానే కనిపిస్తాను. 2019 ఎలక్షన్ల నాటికి ఎక్కడో విదేశాలలో ట్రిప్‌లోనో, లేక షూటింగ్‌లోనో బిజీగా ఉంటాను. నాకు రాజకీయాలు ఇంట్రస్ట్‌ లేదు. నేను సీఎంగా చేస్తున్నానని చెప్పడం లేదు గానీ ఇండియా వంటి పెద్ద దేశంలో సీఎంలందరూ బాగా పనిచేస్తున్నారు. ఇక ఈ చిత్రం చేస్తున్నప్పుడు మా నాన్నగారి ప్రభావం బాగా ఉంది. ముఖ్యంగా ఫస్ట్‌ఓత్‌ డైలాగ్స్‌ని విని అందరు మీ నాన్న గొంతులానే ఉంది అనేవారు. నేను కూడా డబ్బింగ్‌ థియేటర్‌లో విని నా గొంతు మా నాన్నగారిలాగే ఉందని అన్నాను.

Advertisement
CJ Advs

'అల్లూరిసీతారామరాజు, ఈనాడు' వంటి చిత్రాలలో ఆయనకు ఇలాంటి హైపిచ్‌ డైలాగ్స్‌ ఉన్నాయి. కొంత మంది నా గొంతు విని డిజిటల్‌గా ఏమైనా మార్చారా? అని అడిగారు. కాదండీ ఆ గొంతు నాదే అని చెప్పాను. పెద్ద సినిమాలు హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే అద్భుతంగా ఆడుతున్నాయి. కావాల్సినన్నీ థియేటర్స్‌ ఉన్నాయి. మొత్తం కలెక్షన్లను వారంరోజుల్లో లాగేయడానికి ట్రై చేస్తున్నాం. ఇక ఇటీవల వచ్చిన 'రంగస్థలం' పెద్ద హిట్‌ కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇండియా ఇండియానే. విదేశాలకు వెళ్లినా కూడా వారం గడిస్తే చాలు ఇండియా ఎప్పుడు వెళ్దామా? అనే ఉంటుంది. ఈ విషయంలో ఇండియాని మించిందిలేదు. 

నిజానికి 2006 కంటే ముందే 2002లో 'మురారి' సమయంలోనే దానయ్యగారు ఓ చిత్రం చేసిపెట్టమని అడిగారు. నాడే అడ్వాన్స్‌ ఇస్తానన్నారు. అలాంటిది ఆయనకు చేయడానికి ఇప్పుడు వీలైంది. ఇక నాన్నగారి రీమిక్స్‌ చేసి వాటిని చెడగొట్టడం నాకిష్టం లేదు. అందుకే రీమిక్స్‌లు చేయనని చెప్పాను. ఇక రీమేక్‌లమీద కూడా ధ్యాసలేదు. వంశీపైడిపల్లి చిత్రం అద్భుతంగా ఉంటుంది. నాకోసం మరో సినిమా ఒప్పుకోకుండా ఏడాది పాటు కష్టపడి కథను తయారు చేశారు. త్రివిక్రమ్‌, సుకుమార్‌, సందీప్‌రెడ్డి వంగాలతో చిత్రాలు చేస్తాను. అవి ఇంకా డిస్కషన్స్‌ స్టేజీలోనే ఉన్నాయి. 

ఈ చిత్రం వేడుకలో ఎన్టీఆర్‌.. 'మహేష్‌ అన్న ఎన్నో ప్రయోగాలు చేశారు' అన్నాడు. కానీ నాకు ప్రయోగాలు చేసి అలుపు వచ్చింది. అలిసిపోయాను. ఓపిక పోయింది. నాన్నగారి ఫ్యాన్స్‌ అంతా ఇంటికి వచ్చి కొట్టేలా ఉన్నారు. సో.. కమర్షియల్‌ సినిమాల మీద ఎక్కువగా ఫోకస్‌ పెట్టాలని అనుకుంటున్నాను. నేను, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లం మంచి ఫ్రెండ్స్‌ ఇక మేము కలసినప్పుడు కూడా సినిమాల గురించే ఏం మాట్లాడుకుంటాం. అందరి ఫ్రెండ్స్‌లాగే మిగతా విషయాలు మాట్లాడుకుంటాం. సోషల్‌మీడియాలో ఒక హీరో చిత్రాలను మరో హీరో అభిమానులు టార్గెట్‌ చేసుకుంటూ, మరో సినిమాని పోలుస్తూ కాన్‌సన్‌ట్రేషన్‌ చేయడం అనే ట్రెండ్‌ ఏర్పడింది. ఇట్స్‌ నాట్‌ ఫెయిర్‌. సినిమా అంటే హీరోనే కాదు.. కొన్ని వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి పాజిటివ్‌ వైబ్‌ కావాలని కోరుకుంటున్నాను.. . అని మహేష్‌ చెప్పుకొచ్చాడు.

Mahesh Babu Bharat Ane Nenu Interview updates:

Mahesh Babu About Bharat Ane Nenu Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs