Advertisement
Google Ads BL

వర్మ అక్కడ, ఇక్కడ కూడా ప్లాప్!


రామ్ గోపాల్ వర్మ సినిమాలు చేసుకుంటూ అందరిని అయిన దానికీ కాని దానికీ విమర్శిస్తూ కూర్చునే రకం ఆయన. ఎప్పుడూ సోషల్ మీడియాలో  యాక్టీవ్ గా ఉంటూ అందరిని చెడుగుడు ఆడుకునే వర్మ గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్నాడు. జీఎస్టీ తో మహిళా సంఘాలతో, పోలీసుల వ్యవహారంలో మునిగితేలిన వర్మను దాదాపుగా చాలా మంది పట్టించుకోవడం మానేశారు. అయితే ఈమధ్యన ఇండస్ట్రీలో శ్రీ రెడ్డి ఇష్యుతో మళ్ళీ వర్మ అతని ఉనికిని చాటుతున్నాడు. శ్రీ రెడ్డి కి పూర్తిగా మద్దతిస్తూ ఆమె ఏం చేసిన కరెక్ట్ అంటున్నవర్మ ఇప్పుడు చేయకూడని పని చేసాడు.

Advertisement
CJ Advs

ఎప్పుడూ సినిమాలు డైరెక్ట్ చేసే వర్మ ఇప్పుడు నిజజీవితంలో శ్రీ రెడ్డిని డైరెక్ట్ చేశాడు. శ్రీ రెడ్డి క్యాష్టింగ్ కౌచ్ మీద, తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫిలిం ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శనతో పాటు, పలు ఛానల్స్ లో ఇండస్ట్రీలోని వ్యక్తుల వలన తాను మోసపోయానంటూ చాలామంది జాతకాలూ బయటపెడుతున్న శ్రీ రెడ్డి ఒక్కసారిగా హైలెట్ అయ్యింది. శ్రీ రెడ్డి ఉద్యమానికి దిగొచ్చి 'మా' వారు కూడా తాము చేసిన తప్పును తెలుసుకుని శ్రీ రెడ్డికి  'మా' సభ్యత్వం ఇవ్వడానికి ముందుకొచ్చారు.. అక్కడితో ఆగిందా శ్రీ రెడ్డి . పవన్ స్పందించాలంటూ డిమాండ్ చేసింది. అయితే శ్రీ రెడ్డి అడిగిన రెండు రోజులకి పవన్ కళ్యాణ్ పాపం ఆడకూతురు కదా అని.... నేను స్పందిస్తే సరిపోదు.. ఆవిడ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టి.. సమస్య పరిష్కరించుకోవాలి అని ఒకే ఒక్క మాట  అన్నాడు. కానీ శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ ని అనకూడని మాటలంటూ రెచ్చిపోయింది. ఇంకేముంది శ్రీ రెడ్డి ఉద్యమం రివర్స్ లో కొట్టింది. అందరూ ఏకమై శ్రీ రెడ్డికి చుక్కలు చూపెట్టారు. ఇదంతా ఒక కంట గమనిస్తున్న రామ్ గోపాల్ వర్మ, శ్రీ రెడ్డికి మద్దతిస్తున్నానంటూ ముందు నుండి చెబుతూ వచ్చాడు. ఒక్కసారిగా వ్యవహారం అంతా శ్రీ రెడ్డి పీకకు చుట్టుకునే సరికి వర్మ గారు లైవ్ లోకొచ్చారు.

నేనే శ్రీ రెడ్డికి చెప్పాను పవన్ కళ్యాణ్ ని తిడితే నీ ఉద్యమం ఉధృతమవుతోంది.. లేదంటే అందరూ నీరు కార్చేస్తారని.. అలాగే నీకు ఐదు కోట్లు ఆర్ధిక సహాయం చేస్తానని కూడా శ్రీ రెడ్డికి చెప్పడం... దానికి శ్రీ రెడ్డి ఒప్పుకోకపోవడంతో అయితే ఉద్యమాన్ని ఉదృతం చెయ్యి నా డైరెక్షన్ లో అంటూ వర్మగారు సలహా ఇవ్వడంతో.. శ్రీ రెడ్డి రెచ్చిపోయి పవన్ కళ్యాణ్ ని మీడియా ఎదుట తిట్టేసి చెప్పుతో కొట్టేసుకుని రణరంగం సృష్టించింది. ఆ దెబ్బకి శ్రీ రెడ్డిపై పవన్ ఫ్యాన్స్ తో పాటు పలువురు ఇండస్ట్రీ పెద్దలు కన్నెర్ర జెయ్యడంతో ఇదంతా నా డైరెక్షన్ అంటూ వర్మ లైవ్ లోకొచ్చి చెప్పడం... అలాగే ఈ విషయంలో రామ్ గోపాల వర్మ.... శ్రీ రెడ్డికి, పవన్ కళ్యాణ్ కి కూడా తనదే తప్పంటూ క్షమాపణలు చెప్పడం ఒక పెద్ద సినిమాటిక్ కథలా నడిచింది.

మరి రామ్ గోపాల్ వర్మ సినిమాలు వరుసగా ప్లాప్ ఎందుకు అవుతున్నాయో ఇప్పుడు అర్ధమవుతుంది అందరికి. ఇక సినిమాల్లోనే కాదు వర్మ నిజం జీవితంలోని డైరెక్షన్ లోను ప్లాప్ అయ్యాడంటూ నెటిజెన్ల కామెంట్స్ పడేస్తున్నారు. మొత్తానికి వర్మ మాట విన్నందుకు  ఇప్పుడు శ్రీ రెడ్డి మాత్రం శిక్ష అనుభవించాల్సిందే అంటుంటే.... దానికి శ్రీ రెడ్డి మాత్రం ఎవ్వరిని వదలను అందరి జాతకాలూ బయటకి తీస్తానంటూ బెదిరిస్తూనే ఉంది.

RGV's one More Flop Movie:

Ram Gopal Varma Behind Sri Reddy! 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs