Advertisement
Google Ads BL

మెగా బ్రదర్‌ కరెక్ట్ గా ఇచ్చాడు..!


శ్రీరెడ్డి కాస్టింగ్‌కౌచ్‌ గురించి మాట్లాడుతూ ఉంటే ఆమెది కూడా అందులో తప్పులు కనిపిస్తున్నా కూడా ఓ ఆడకూతురిగా భావించి పలువురు ఆమెకి మద్దతు ప్రకటించాడు. కానీ శ్రీరెడ్డి ఎప్పుడయితే ఈ విషయంలో సంబంధం లేని పవన్‌ని, ఆయన తల్లిని తెర మీదకి తెస్తూ అసభ్యంగా మాట్లాడిందో అప్పటి వరకు ఆమెకి మద్దతుగా ఉన్న మాధవీలత, పూనమ్‌కౌర్‌ వంటి వారు కూడా ఆమెకి దూరమయ్యారు. ఇక తాజాగా మెగాబ్రదర్‌ నాగబాబు మాట్లాడుతూ, తమ మౌనాన్ని చేత కాని తనంగా తీసుకోవద్దని, కోట్లు వచ్చే సినిమాలను వదులుకుని రాజకీయాలలోకి వెళ్లి ప్రజాసేవ చేయాలని భావిస్తున్న పవన్‌ని ఈ విషయంలోకి లాగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

Advertisement
CJ Advs

ఇక 'మా'లో సభ్యత్వం ఉన్న, లేని లేడీ ఆర్టిస్టులు తమపై వేధింపులు జరిగినప్పుడు పోలీసుల వద్ద కేసు పెట్టి, లీగల్‌గా ముందుకెళ్లాలి. దేశంలోని చట్టాలు ఇప్పుడు ఎంతో కఠినంగా ఉన్నాయి. కొంతమంది వెధవలు వేధిస్తే చెప్పుతీసుకుని కొట్టండి. అంతేగానీ ఇండస్ట్రీని చులకన చేస్తూ మాట్లాడవద్దు. నా కూతురుని కూడా నేను సినిమాలలోకి తీసుకుని వచ్చాను. 'మా' అసోసియేషన్‌ వారికి న్యాయం చేయడం మా బాధ్యత. 'మా'లో ఫ్రీ మెంబర్‌షిప్‌ లేదు. ఫలానా వారికే అవకాశాలు ఇవ్వాలని 'మా' నిర్మాతలకు చెప్పేందుకు వీలులేదు. కాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఇప్పుడు వచ్చింది కాదు. ఇది ప్రపంచంలోని అందరికీ తెలసిన విషయమే. 

ఈ వ్యవహారాన్ని గత నెల రోజులుగా గమనిస్తున్నాను... అంటూ ఆవేశానికి లోనయ్యాడు. దాంతో పక్కనే ఉన్న శ్రీకాంత్‌ ఆయన్ను శాంతించేలా చేయాల్సి వచ్చింది. మొత్తానికి పవన్‌ మీద శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మెగాబ్రదర్‌ నాగబాబు కాస్త ఘాటుగానే స్పందిస్తూ, చురకలు వేస్తూ మాట్లాడటం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది....! 

Nagababu Press Meet On Sri Reddy Issue:

Actor and producer Nagababu held a press meet at Film Chamber over the recent controversies in Tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs