Advertisement
Google Ads BL

వర్మా.. నీ బతుక్కి ఇంత యాగీ అవసరమా?


ఈ మాటన్నది ఎవరో కాదు టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్. శ్రీ రెడ్డి, పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చెయ్యడం వాటిని రామ్ గోపాల్ వర్మ మద్దతునియ్యడంతో... ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద దుమారమే రేగింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దగ్గర నుండి... సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరు శ్రీ రెడ్డిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. శ్రీరెడ్డి ఉద్యమాన్ని పట్టించుకోని వారు పవన్ కళ్యాణ్ ని శ్రీ రెడ్డి తిట్టగానే...బావిలో కప్పల్లా.. ఒక్కొక్కరిగా బయటికి వచ్చి మరి ప్రెస్ మీట్స్ పెడుతున్నారు. నిన్నటికి నిన్న నాగబాబు, మాధవీలత, రమేష్ పుప్పాల, రామ్ చరణ్, వరుణ్ తేజ్, నితిన్  వంటి వారు శ్రీరెడ్డి పై ఫైర్ అవ్వగా... వెంటనే శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ తల్లికి క్షమాపణ చెప్పింది. అయినా శ్రీ రెడ్డిని తిట్టడం ఆపలేదు జనాలు. అయితే ఉన్నట్టుండి శ్రీ రెడ్డి వెనుక పెద్ద డైరెక్టర్ అంటూ... ఒక న్యూస్ మీడియాలో వచ్చిన గంటకే.. రామ్ గోపాల్ వర్మ ఒక వీడియోని మీడియాకి పంపాడు. నేనే శ్రీ రెడ్డికి చెప్పాను... నీ ఉద్యమం ఉదృత రూపం దాల్చాలంటే పవన్ కళ్యాణ్ ని తిట్టమని. అందుకే శ్రీ రెడ్డి, పవన్ ని తిట్టింది అంటూ వీడియో పోస్ట్ చేశాడు.

Advertisement
CJ Advs

దానితో అందరూ రామ్ గోపాల్ వర్మని బండ బూతులు తిడుతున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ అంతు చూస్తామంటూ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుండగా... కొద్దిసేపటి క్రితమే అల్లు అరవింద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ రామ్ గోపాల్ వర్మని కడిగిపారేశారు. అల్లు అరవింద్ తాను ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషినని చెబుతూ.. రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమా ఇండస్ట్రీతో పైకి ఎదిగి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని అపహాస్యం చేస్తున్నాడని.. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతున్నాడంటూ ఫైర్ అయ్యాడు. అలాగే వర్మ నీచుడు, నికృష్టుడు అంటూ వర్మపై రెచ్చిపోయి మాట్లాడాడు. ఏదో రాజకీయ శక్తి వర్మ వెనుక ఉండి ఆడిస్తుందని.. తన మీదకు రాకుండా ఉండాలనే శ్రీ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఈ నాటకం అంతా నడిపాడని.. వర్మని కడిగిపారేశాడు.

అలాగే వర్మకు అల్లు అరవింద్ కొన్ని ప్రశ్నలు సంధించారు. అల్లు అరవింద్ వర్మను ఉద్దేశించి 'నీ తల్లినో, అక్కనో తిట్టిస్తే బాధ ఎలా ఉంటుందో నీకు  తెలుసా’... అసలు  వర్మ... నీ బతుక్కి ఇంత యాగీ అవసరమా అంటూ వర్మ పై అల్లు అరవింద్ ఒక రేంజ్ లో రేజ్ అయ్యాడు. అలాగే శ్రీరెడ్డి విషయాన్నీ తామేమి తేలిగ్గా తీసుకోలేదని.. క్యాస్టింగ్‌కౌచ్‌ విషయంలో ఒక కమిటీని వేస్తున్నామని.. అది కూడా ఒకటి రెండు రోజుల్లో బయటికొస్తుందని.. అందులో సగం మంది సినిమా వాళ్లు ఉంటే... మిగతా సగం మహిళా సంఘాల వారు ఉంటారని ఆయన తెలిపాడు.

Producer Allu Aravind Fire On Ram Gopal Varma:

Pawan Kalyan And Sri Reddy Issue.. Allu Aravind Fire On RGV
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs