Advertisement
Google Ads BL

రామ్ చరణ్‌ మరలా కష్టపడుతున్నాడు!


తన రెండో చిత్రం 'మగధీర' తర్వాత మరలా 11 వ చిత్రం 'రంగస్థలం'తో రామ్‌చరణ్‌ రెచ్చిపోయాడు. ఏకంగా ఈచిత్రాన్ని తీసుకెళ్లి 'బాహుబలి-ది బిగినింగ్‌,బాహుబలి-ది కన్‌క్లూజన్‌'ల తర్వాత కూర్చొబెట్టాడు. ఇక ఫ్లాప్‌లలో ఉన్నప్పుడు హిట్‌ కొట్టడానికి ఎంతగా కష్టపడాలో..ఇలాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత వచ్చే చిత్రంపై అంచనాలు ఆకాశంలోఉండటంతో అంతకంటే ఎక్కువ కష్టపడాల్సి వుంటుంది. అందుకే విజయం మరింత బాధ్యతను పెంచుతుందని పెద్దవారు చెబుతారు. ఇక ఒకనాడు హీరోలంటే ఏదో విగ్గు, మేకప్‌,కాస్ట్యూమ్స్‌తో సరిపెట్టి దానినే మేకోవర్‌కింద పరిగణించేవారు. కానీనేడు పరిస్థితి అలాలేదు. దర్శకులు అంతగా కష్టపడాల్సిన అవసరం లేదని చెబుతున్నా కూడా ప్రేక్షకులకు సరికొత్తగా కనిపించేందుకు హీరోలే బాడీని వివిధ రూపాలలోమార్చి కనిపిస్తున్నారు. జైలవకుశ తర్వాత ఎన్టీఆర్‌ మరలా త్రివిక్రమ్‌ చిత్రం కోసం ఎలా మారిపోయాడో తెలిసిందే. 

Advertisement
CJ Advs

ఇక రామ్‌చరణ్‌ విషయానికి వస్తే ఈయన 'రంగస్థలం' కోసం పూర్తిగా గుబురు గడ్డంతో మేకోవర్‌ అయ్యాడు. ఇక బోయపాటి శ్రీను చిత్రం అంటే అందరికీ తెలిసిందే. ఆమధ్య వచ్చిన అల్లుఅర్జున్‌ 'సరైనోడు' కోసం కూడా బన్నీని కండలు తిరిగిన శరీరంతో చూపించాడు. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్రం ఇప్పటికే షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ చిత్రం షూటింగ్‌లోకి రామ్‌చరణ్‌ ఇంకా ఎంటర్‌ కాలేదు. ఈనెల 21న ప్రారంభంకానున్న షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌ జాయిన్‌ అవుతాడు. దాంతో చరణ్‌ గడ్డం తీసేసి కండలు పెంచుతున్నాడు. 

దీని కోసం సల్మాన్‌ఖాన్‌ ఫిట్న్‌నెస్‌ ట్రైనర్‌ రాకేష్‌ని రప్పించాడు. సదరు రాకేష్‌ ఉడయార్‌ సాయంతోనే రామ్‌చరణ్‌ 'ధృవ' చిత్రంలో సిక్స్‌ప్యాక్‌ సాధించాడు. ఇక ఈ చిత్రం విషయంలో కూడా చరణ్‌ అదే చేస్తున్నాడు. అతి తక్కువ గ్యాప్‌లో కండలు పెంచుతున్నాడు. ఇక ఖాళీ కడుపుతో ప్రయోగాలు చేస్తున్నాడు. అపోలో ఆసుపత్రిలో కార్డియో కూడా పూర్తయిందని ఉపాసన సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. మరి ఇంత కష్టపడుతున్న చరణ్‌ ఎలా కనిపించనున్నాడు? ఇదే గెటప్‌నే ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళితో చేసే మల్టీస్టారర్‌లోకూడా కనిపిస్తాడా?లేదా? అన్నదిచూడాలి...! 

Ram Charan New Look For Boyapati Srinu Film:

<h1><span style="font-weight: normal;">Upasana Reveals Charan Secrets</span></h1>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs