Advertisement
Google Ads BL

'భరత్'ని టెన్షన్ పెడుతున్న కాస్టింగ్ కౌచ్..!!


 

Advertisement
CJ Advs

మహేష్ బాబు తాజా చిత్రం 'భరత్ అనే నేను' రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ భారీగా బరిలోకి దిగుతున్న భరత్ అనే నేను సినిమా ప్రమోషన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. ఏ గోడ మీద చూసినా.... ఏ హోర్డింగ్స్ చూసినా, ఏ ఆటోల మీద చూసినా భరత్ అనే నేను పోస్టర్స్ యే కనబడుతున్నాయి. అలాగే భరత్ టీమ్ మొత్తం ప్రమోషన్స్ లో  హడావిడిగా ఉంది. మహేష్ బాబు కూడా విదేశాల నుండి వచ్చేసి భరత్ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నాడు. అయితే ఎంతగా భరత్ ప్రమోషన్స్ ని ప్రేక్షకుల్లోకి తీసుకెళదామనుకున్నా.... ఇప్పుడు ఇండస్ట్రీని శ్రీ రెడ్డి వివాదం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. 

మరి నిన్న బుధవారం భరత్ అనే నేను ప్రమోషన్స్ కన్నా ఎక్కువగా మీడియాలో శ్రీ రెడ్డి వివాదమే నడిచింది. జీవిత రాజశేఖర్ బయటికి వచ్చి మహిళానేత సంధ్య మీద కేసు పెట్టినట్లుగా ప్రెస్ మీట్ పెట్టి.. పనిలో పనిగా ఇండస్ట్రీలోని వారంతా ఏమై పోయారు. ఈ వివాదం గురించి మాట్లాడడానికి అంటూ చురకలు వేసేసరికి.. ఇండస్ట్రీలోని పెద్దమనుషులంతా బావిలోని కప్పలుగా ఒక్కొక్కరుగా మీడియా సమావేశాలు నిర్వహించడమే కాదు... ఈ ఇష్యుపై టివి ఛానల్స్ లో డిబేట్స్ పెట్టడం.. ఇలా శ్రీరెడ్డి హడావిడీ మీడియాలో మాములుగా లేదు. ఇక ఈ వ్యవహారంలో నటి మాధవి లత పవన్ పై శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మౌన దీక్ష చేస్తే... నాగబాబు తమ్ముడు తరుపున, సినిమా ఇండస్ట్రీ తరుపున శ్రీ రెడ్డి వ్యవహారంపై ప్రెస్ మీట్ పెట్టాడు. మరో నిర్మాత రమేష్ పుప్పాల కూడా  శ్రీరెడ్డి కావాలనే ఇదంతా చేస్తూ అందరిని ఇరికిస్తుంది అంటూ ఒక ఛానల్ తో మాట్లాడాడు. అలాగే పలు టివి ఛానల్స్ లో కూడా శ్రీ రెడ్డి, పవన్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ  ఇంటర్వూస్ ఇవ్వడం.... శ్రీ రెడ్డి కి అనుకూలంగా మహేష్ కత్తి ఒక ఛానల్ కూర్చుని సపోర్ట్ ఇవ్వడం.. అలాగే శ్రీ లీక్స్ ఆగవంటూ... ముందుముందు ఇలాంటివి చాలా ఉంటాయి అంటూ బెదిరించడం ఇలా టివి ఛానల్స్, వెబ్ ఛానల్స్, ఆఖరుకి ప్రింట్ మీడియా కూడా శ్రీరెడ్డి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని హడావిడి హడావిడి చేసింది.

అయితే ఎంతో ముఖ్యమైన మహేష్ బాబు ఇంటర్వూస్ ని ఎప్పుడో.. ఏదో టైం లో ప్రసారం చేశాయి మీడియా ఛానల్స్ వారు. మరి ఇప్పటికే కొరటాల శివ, శ్రీ రెడ్డి వ్యవహారంలో ఒక వీడియో తీసి మీడియాకి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇక ప్రస్తుతం శ్రీరెడ్డి వివాదం.. భరత్ అనే నేను మీద ఉన్న క్రేజ్ కూడా కొద్దిగా తగ్గేలానే ఉంది ప్రేక్షకుల్లో. అంతలా శ్రీరెడ్డి వివాదం మీడియాలో హైలెట్ అయ్యింది. మరి భారీ అంచనాల నడుమ మరికొన్ని గంటల్లో  విడుదల కాబోయే భరత్ అనే నేను ప్రమోషన్స్ మీద కూడా మీడియా కాస్త జాలి చూపిస్తే బావుంటుంది అంటూ చాలామంది వాపోతున్నారు. ఇక ఈ విషయంలో భరత్ టీమ్ కూడా కొద్దిగా టెన్షన్ పడినట్లుగా కూడా వార్తలొస్తున్నాయి.

Sri Reddy Dominated Bharat Ane Nenu:

<h3 class="text-center"><span style="font-weight: normal;">Mahesh Babu, Koratala Siva Comes Out Clean</span></h3>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs