Advertisement
Google Ads BL

రవితేజని హీరోయిన్ ఆపుతుంది..!


రవితేజ 'టచ్ చేసి చూడు' సినిమా డిజాస్టర్ తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేల టికెట్'  సినిమాని మొదలు పెట్టాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న 'నేల టికెట్' సినిమాని మే నెల 25 న విడుదల చేస్తున్నట్లుగా ఎప్పుడో ప్రకటించింది చిత్ర బృందం. అయితే తాజాగా రవితేజ 'నేల టికెట్' మే 25 కి రాకపోవొచ్చు... అది మే 25 నుండి పోస్ట్ పోన్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి అంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న 'నేల టికెట్'  సినిమా కొన్ని కారణాల వలన అనుకున్న డేట్ కి రాకపోవచ్చని ప్రచారం జరుగుతుంది.

Advertisement
CJ Advs

అయితే షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయిన ఈ సినిమా లేట్ కి కారణం ఆ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ మాళవిక శర్మ అంటున్నారు. మాళవిక శర్మ కి 'నేల టికెట్'  సినిమా షూటింగ్ లో కాలు నరం మెలిక పడడం వలన కొన్ని రోజులు షూటింగ్ కి రెస్ట్ తీసుకున్నప్పటికీ... తర్వాత తన కాంబినేషన్ సీన్స్ షూటింగ్ ఎలాగో ఆలా పూర్తి చేసిందట. కానీ పాటల్లో డాన్స్ స్టెప్స్ వెయ్యాలి గనక.. ప్రస్తుతం ఎక్కువసేపు నిల్చుని చేసే ఎలాంటి పనులు మాళవిక శర్మ చేయలేకపోవడంతో... 'నేల టికెట్'  పాటలు రెండు బ్యాలెన్స్ ఉండిపోయాయట. మరి మాళవిక కాలు కాస్త కోలుకున్నాకే ఆ పాటల చిత్రీకరణ పూర్తి చెయ్యాలని చిత్రబృందం డిసైడ్ అయ్యిందట. 

అయితే త్వరలోనే మాళవిక కోలుకుని పాటల కోసం రెడీ అయితే ఒకే.. లేదంటే సినిమాని మే నుండి జూన్ మొదటి వారానికి షిఫ్ట్  చేసే యోచనలో 'నేల టికెట్'  టీమ్ ఉందట. మరి నాగార్జున 'ఆఫీసర్' కి పోటీగా తమ సినిమాని దింపుతున్నామని అధికారికంగా ఛాలెంజ్ చేసిన రవితేజ ఇప్పుడు తగ్గినా తగ్గొచ్చంటున్నారు. ఇక నాగార్జున - ఆర్జీవీల 'ఆఫీసర్' కూడా మే 25 నే విడుదలవుతుంది. మరి రవితేజ 'నేల టికెట్' గనక పోస్ట్ పోన్ అయితే రవితేజ.. నాగ్ 'ఆఫీసర్' కి దారిచ్చినట్టే అవుతుంది.

Mass Raja Ravi Teja Nela Ticket Movie Release Postponed:

Ravi Teja Nela Ticket Movie Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs