Advertisement
Google Ads BL

శ్రీ రెడ్డిపై రామ్ చరణ్ ఘాటు స్పందన!


పవన్ కళ్యాణ్ మీద శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పడు రెండు తెలుగు రాష్ట్రాల్లోను పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ ని శ్రీ రెడ్డి నోటికొచ్చినట్లుగా మాట్లాడడం కరెక్ట్ కాదని.... పవన్ ఫ్యాన్స్ ఆమె అంతు చూస్తామని హెచ్చరిస్తుంటే... పవన్ చిన్నన్నయ్య నాగబాబు ప్రెస్ మీట్ పెట్టి మరి శ్రీ రెడ్డి ని ఎడా పెడా వాయించేశాడు. అలాగే మెగా హీరోలంతా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా మాట్లాడడమే కాదు.. చాలామంది శ్రీ రెడ్డి విషయంలో పవన్ కళ్యాణ్ ని దూషించడం ఏమిటంటూ విరుచుకుపడుతున్నారు. అయితే శ్రీ రెడ్డి  కాస్త వెనక్కి తగ్గి పవన్ కళ్యణ్ అమ్మగారికి క్షమాపణ చెప్పినా... ఆమెపై విరుచుకుపడేవారు ఎక్కువయ్యారు కానీ... ఎవ్వరు తగ్గడం లేదు. 

Advertisement
CJ Advs

ఇక నిన్నటి నుంచి మౌనం వహించిన రామ్ చరణ్ కూడా తన బాబాయ్ కి మద్దతుగా శ్రీ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్న టైప్ లో సోషల్ మీడియా లో ఘాటుగా స్పందించాడు.. రామ్ చరణ్.. పవన్ కళ్యాణ్ కి మద్దతుగా.. 'అందరూ కలిసి పని చేసుకుంటూ ఎదగాల్సిన ఒక కుటుంబం లాంటిది మన ఇండస్ట్రీ. మన ఇండస్ట్రీలో మహిళలలను ఎప్పుడూ అత్యంత గౌరవంతో చూస్తారు. ఏవైనా సమస్యలు ఉన్నా వాటిని న్యాయబద్ధంగా, సంస్కారవంతంగా పరిష్కరించుకోవాలి. అయితే, కొందరి పేర్లు అనవసరంగా లాగి రాద్ధాంతం చేసి పాపులర్ అవ్వాలని చూడటం చవకబారుతనంగా ఉంటుంది' అంటూ ఘాటుగా స్పందించాడు.

Ram Charan Reacts on Sri Reddy's Abuses:

Charan's Post on Sri Reddy Issue
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs