Advertisement
Google Ads BL

గోవా బ్యూటీ తల్లి కాబోతుందా?


గోవాసుందరి అయిన ఇలియానా తెలుగులో మొట్టమొదటిసారి కోటి రూపాయల పారితోషికం తీసుకున్న గ్లామర్‌ హీరోయిన్‌ అని చెప్పాలి. ఇక ఈమె 'జులాయి' తర్వాత తెలుగులో కనిపించడమే మానేసింది.బాలీవుడ్‌కి వెళ్లినా అక్కడ కూడా వరుస అవకాశాలేమీరావడం లేదు. ఇక ఈమె ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్‌ అండ్రూ నీబోన్‌తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజుకోసారి ఆమె సోషల్‌ మీడియాలో కనిపించి, తన హబ్బీ అంటూ తనభర్తగా ఇన్‌డైరెక్ట్‌గా పోస్ట్‌లు చేస్తూనే ఉంది. కానీ మీడియా అడిగితే మాత్రం నా పర్సనల్‌ విషయాలు మీకెందుకు? నేను ఎక్కడైనా చెప్పాల్సినంత వరకే చెబుతాను అని ఘాటుగా రిప్లైలో ఇస్తూ ఉంటుంది. 

Advertisement
CJ Advs

ఇక ఈమె గత కొన్నిరోజులుగా సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా లేదు. ఇక ఈమె నటించిన 'రెయిడ్‌' చిత్రం విడుదల సందర్భంగా ఈమె ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. సాధారణంగా తన అందాలను,కొలతలను చూపిస్తూ డ్రస్‌ చేసుకునే ఇలియానా 'రెయిడ్‌' ప్రమోషన్‌లో మాత్రం లూజు దుస్తులు వేసుకుని కనిపించింది. పైగా తన పొట్టకి హ్యాండ్‌బ్యాగ్‌ని అడ్డం పెట్టుకుంది. దీంతో ఇలియానా తల్లి కాబోతోందని బిటౌన్‌ వర్గాలు అంటున్నాయి. ఇక సహజీవనం వల్ల పెళ్లికి ముందేపిల్లలా? లేక ఆల్‌రెడీ రహస్యంగా వీరి పెళ్లి అయిపోయిందా? అనే అనుమానాలు వస్తున్నాయి.

ఇక ఈమెబోయ్‌ఫ్రెండ్‌ నీబోన్‌ ఇలియానా బాత్‌టబ్‌లో పడుకుని కాఫీ సేవిస్తూ దర్శనమిస్తున్న ఫొటోని పోస్ట్‌ చేశాడు. దాంతో పాటు ఆయన 'ఇలియానా ఒంటరిగా ఎంజాయ్‌ చేస్తోంది. నిజానికి ఆమెకి తోడు ఉందిలే.. 'అని అనడం చూస్తే ఆమెకితోడుగా ఉన్నది ఆమె కడుపులోని బిడ్డే అని అందరు ఓ నిశ్చయానికి వస్తున్నారు. మొత్తానికి ఈ విషయంపై మాట్లాడితే ఇలియానాకి కోపంవచ్చినా అసలు నిజం దాచితే దాగదులే అని చెప్పాలి.....!

Is Ileana pregnant with first baby?:

Rumour has it: Is Ileana D'Cruz pregnant? 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs