Advertisement
Google Ads BL

కొరటాల ఆవేదన విన్నారా..!


శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో కొన్ని వాస్తవాలు ఉండి ఉండవచ్చు. కానీ ఆమె మొదట ఏ ఇష్యూపైన అయితే పోరాటం మొదలుపెట్టిందో.. తర్వాత దాని మార్గం మారిపోయింది. శ్రీరెడ్డి కేవలం బ్లాక్‌మెయిలింగ్‌, చీప్‌ పబ్లిసిటీకోసమే ఇలా చేస్తోందనే వారి సంఖ్య పెరుగుతుంది. ఇక ఈమె శేఖర్‌కమ్ముల నుంచి కొరటాల శివ వరకు అందరిపై ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్‌ చేస్తూ రచ్చచేస్తోంది. కానీ కొరటాల, శేఖర్‌కమ్ముల వ్యక్తిత్వాలు తెలిసిన వారు మాత్రం ఆమె నిజంగానే పెద్ద అబద్దం చెబుతోందని అంటున్నారు. ఇక తనను కేవలం కోర్టుకి, పోలీస్‌ల వద్దకు వెళ్లమని అనినందుకు పవన్‌పై ఆమె చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు మరీ దిగజారుడుతనంగా ఉన్నాయి. ఇక కొరటాలశివపై కూడా శ్రీరెడ్డి ఇన్‌డైరెక్ట్‌గా నిందలు వేసింది. ప్రస్తుతం ఆయన 'భరత్‌ అనే నేను' చిత్రం రిలీజ్‌ బిజీలో ఉన్నాడు. దానితో తనపై వచ్చిన ఆరోపణలపై మరలా స్పందిస్తానని తెలిపాడు. 

Advertisement
CJ Advs

తాజాగా కొరటాల ఈ విషయంలో స్పందించాడు. నాపై స్క్రీన్‌షాట్స్‌ పేరుతో కొన్ని వార్తలు, నిందలురావడం నన్ను బాధపెట్టింది. ఇది గాసిపే..నీపేరు డైరెక్ట్‌గా చెప్పలేదు కదా..! మౌనంగా ఉండమని సన్నిహితులు చెప్పారు. కానీ నాకు మాత్రం కాస్త బాధగా,టెన్షన్‌గా ఉంది. అందుకే దీనిపై నేను వివరణ ఇస్తున్నాను. నా జీవితంలో నన్ను నడిపించింది ఇద్దరు మహిళా మూర్తులు. చిన్నప్పుడే నాన్న మరణించడం వల్ల మా అమ్మ నన్ను పెంచింది. తర్వాత పెళ్లయిన తర్వాత కొంత కాలానికి అమ్మ మరణిస్తే, ఇప్పుడు నా సంగతులన్నీ నా భార్యే చూసుకుంటోంది. ఇక నాకు కాస్టింగ్‌కౌచ్‌ అంటేనే కోపం. నేను ఆడవారిని, పెద్ద నటీనటులనే కాదు.. చిన్నవారిని కూడా అండీ అని పిలుస్తాను. కాస్టింగ్‌కౌచ్‌ని నేను వ్యతరేకినే కాదు.. నా చుట్టుపక్కల అలా జరుగుతున్నా నేను ఒప్పుకోను. వాటిని చాలా సీరియస్‌గా తీసుకుంటాను. 

ఇప్పటివరకు నాలుగు చిత్రాలు తీశాను. అందులో నాతో పనిచేసిన వారిని కావాలంటే మీరే అడగండి. నాకు మహిళల గొప్పతనం మా అమ్మా, భార్య వల్ల బాగా తెలుసు. ఆడవారు, మగవారు అనే తేడా లేకుండా అందరు మనుషులనే భావనలో ఉంటాను. నా చిత్రాలలో కూడా మహిళలను కించపరిచేలా సీన్స్‌ తీయను. నాకు మహిళంటే అంత గౌరవం ఉంది. ఇక మేము వివేకానందుని ఫాలోయర్స్‌మి. నాడు వివేకానంద కూడా అమెరికావెళ్లినప్పుడు పలు విమర్శలువచ్చాయి... అంటూ చెప్పుకొచ్చారు. 

Koratala Siva Responds on Whatsapp Chat Controversy:

<h1><span style="font-weight: normal;">Koratala Clarifies on Sri Reddy Issue</span></h1>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs