Advertisement
Google Ads BL

నెటిజెన్ కి అనసూయ భలే ఇచ్చింది..!


మొత్తానికి 'జబర్ధస్త్‌' షో తర్వాత అనసూయలోని అసలు సిసలు టాలెంట్‌ 'రంగస్థలం'లోని రంగమ్మత్త పాత్ర ద్వారా జనాలకు తెలిసి వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటనకు బోలెడు ప్రశంసలు వస్తున్నాయి. గ్లామర్‌షో తప్పఅనసూయలో నటికి కావాల్సిన మెటీరియల్‌లేదనే వారికి 'రంగస్థలం'లోని రంగమ్మత్త పాత్ర ద్వారా అనసూయ సమాధానం చెప్పింది. ఆమె ఈ పాత్రలో అంతగా ఒదిగిపోయిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇదే సమయంలో 'రంగస్థలం'లో అనసూయ నటనను చూసి ముగ్దులైన మెగా ఫ్యామిలీ, సురేందర్‌రెడ్డిలు తాము చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్ది దర్శకత్వంలో చేస్తున్న 'సై..రా..నరసింహారెడ్డి'లో కూడా ఓ ముఖ్యపాత్రని ఇచ్చారని ప్రచారం మొదలైంది. అయితే ఇందులో నిజంలేదని అనసూయ తేల్చింది. తనకు 'సై..రా' యూనిట్‌ నుంచి పిలుపు కాదు కదా...! కనీసం ఫోన్‌ కూడా రాలేదని ఈమె చెప్పుకొచ్చింది. భారీ స్టార్‌కాస్ట్‌తో, గ్రాండియర్‌గా రూపొందుతున్న 'సైరా...' చిత్రంలో అవకాశం వస్తే మాత్రం అది తన అదృష్టమేనని, ఆ చిత్రంలో ఏ పాత్రలో చాన్స్‌ వచ్చినా చేస్తానని అంటోంది. 

Advertisement
CJ Advs

ఇక ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ.. తనను టార్గెట్‌గా చేసుకుని సోషల్‌ మీడియాలో నెగిటివ్‌ కామెంట్స్‌ వస్తున్నాయని, ఓ వైపు హాట్‌యాంకర్‌గా కనిపించడంతో పాటు ఇద్దరు పిల్లలున్న తల్లివైన నీకు ఐటం సాంగ్స్‌ వంటివి అవసరమా? అని ప్రశ్నిస్తున్నారని ఆమె తెలిపింది. దానికి అనసూయ సమాధానం ఇస్తూ, బాలీవుడ్‌లో ఎందరో హీరోయిన్లు పెళ్లి, పిల్లల తర్వాత కూడా నటనను కొనసాగిస్తూ సత్తా చాటుతున్నారని, తెలుగులో కూడా భానుమతి, సావిత్రి వంటి వారు పెళ్లితర్వాత కూడా నటించి సక్సెస్‌ అయ్యారని వారికి వివరించే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి ఏది ఏమైనా అనసూయ అంటే మాత్రం ఎందుకో నెటిజన్లు బాగా మండిపడుతూ ఉంటారనే చెప్పాలి. 

Anasuya Class to Netizen:

Anasuya Fire on Netizen in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs