Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ కష్టం... చరణ్ సంతోషం..!


రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఒక బడా మల్టీస్టారర్ లో నటించబోతున్నారు. డి.వి.వి దానయ్య నిర్మాతగా #RRR  అంటూ రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ కలిసి ఈ మల్టీస్టారర్ లో భాగస్వాములవుతున్నామని అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా దాదాపుగా 250 నుండి 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నదనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అలాగే ఈ సినిమా కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కాకుండా రాజమౌళి సన్నిహితుడు గుణ్ణం గంగరాజు అందిస్తున్నాడని... కూడా కొన్ని వార్తలు వినబడుతున్నాయి. ఈ కథ క్రీడా నేపథ్యంలో ఉండబోతుందని అంటున్నారు. రామ్ చరణ్ హార్స్ రైడర్ గాను, ఎన్టీఆర్ బాక్సర్ గాను ఈ సినిమాలో నటిస్తున్నారంటున్నారు.

Advertisement
CJ Advs

మరి రాజమౌళి సినిమా కోసం ఇప్పటినుండి ఎన్టీఆర్, చరణ్ లు జిమ్ ల్లో వర్కౌట్స్ చేస్తూ తెగ బిజీగా గడుపుతున్నారు. అయితే రామ్ చరణ్ ఈ సినిమాలో హార్స్ రైడర్ గా కనిపిస్తాడంటున్నారు కాబట్టి రామ్ చరణ్ కి ఇప్పటికే హార్స్ రైడింగ్ లో ఫుల్ ఎక్సపీరియెన్స్ ఉంది. సో.. చరణ్ ఇక హార్స్ రైడింగ్ లో కొచింగ్ తీసుకోనక్కర్లేదు. అలాగే ధ్రువ సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీకి మారిన... చరణ్ రంగస్థలం సినిమా కోసం మంచి బాడీ ని మెయింటింగ్ చేశాడు. అందుకే ప్రస్తుతం బోయపాటి సినిమా కోసం కొద్దిగా కండలు కరిగించాడు. కానీ రామ్ చరణ్... రాజమౌళి సినిమా కోసం ప్రత్యేకంగా కండలు పెంచక్కర్లేదు అలాగే కరిగించక్కర్లేదు. ఈ విషయంలో చరణ్ ఫుల్ హ్యాపీ.

కానీ ఎన్టీఆర్ మాత్రం రాజమౌళి సినిమా లుక్ కోసం చాలానే కష్టపడాలి. ఎందుకంటే జై లవ కుశ లో కొంచెం లావుగా తయారైన ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా కోసం బాగా సన్నబడ్డాడు. కానీ రాజమౌళి సినిమాలో బాక్సర్ గా అంటే మళ్ళీ కండలు పెంచాలి. ప్రస్తుతం జిమ్ లో కష్టపడి ఒళ్ళు తగ్గించిన ఎన్టీఆర్.. మళ్ళీ రాజమౌళి కోసం కొత్తగా కండల వీరుడుగా మేకోవర్ అవ్వాలి. మరి పాపం ఎన్టీఆర్, జక్కన్న సినిమా కోసం చాలా కష్టపడాలి. అలాగే కుస్తీ వీరుడిగా కూడా ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ కి ఈ బాక్సింగ్ లో అసలు ప్రవేశం లేదు.  సో.. ఆ విధంగా రాజమౌళి సినిమా కోసం చరణ్ ఫుల్ హ్యాపీ అయితే.. ఎన్టీఆర్ మాత్రం కష్టపడక తప్పదు.

NTR Working Hard For Rajamouli Film:

<h1><span style="font-weight: normal;">Rajamouli Troubling NTR, Charan Is Happy</span></h1>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs