Advertisement
Google Ads BL

రాజు గారికి రాంగ్ స్టెప్స్ ఎక్కువైనాయ్!


టాలీవుడ్ లో సూపర్ నిర్మాత ఎవరు అంటే వెంటనే దిల్ రాజు పేరే చెబుతారు. సినిమా కథలను ఎంతో కాలిక్యులేట్  చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. గత ఏడాది వరుస హిట్స్ తో ఉన్న దిల్ రాజు నుండి సినిమా వస్తుంది అంటే అందరిలో అమితాసక్తి ఉంటుంది. కానీ దిల్ రాజు నిర్మాతగా సక్సెస్ అయినట్లుగా డిస్ట్రిబ్యూటర్ గా మాత్రం వరుస పరాజయాలతో కుదేలైయ్యాడు. గత ఏడాది స్పైడర్ విషయంలో బాగా దెబ్బతిన్న దిల్ రాజు.. ఈ ఏడాది అజ్ఞాతవాసి విషయంలోనూ గట్టిగా దెబ్బ తిన్నాడు. ఈ రెండు సినిమాల నైజాం హక్కులను భారీగా కొనుగోలు చేసిన దిల్ రాజుకి ఆ సినిమాల ప్లాప్స్ తో భారీ నష్టాలొచ్చాయి.

Advertisement
CJ Advs

నైజాంలో స్పైడర్ తో పాటు విడుదలైన మరో భారీ చిత్రం జై లవ కుశ కూడా దిల్ రాజుని బయట పడెయ్యలేక పోయింది. భారీ సినిమాల మీద భారీ నమ్మకంతో దిల్ రాజు భారీగా నష్టపోతున్నాడు. అందుకే పెద్ద సినిమాల పంపిణీ జోలికి ఇక నుండి వెళ్లకూడదని దిల్ రాజు డిసైడ్‌ అయ్యాడు. అలాగే పెద్ద సినిమాలని ఒక ఏరియాకి కొని నష్టపోయేకంటే.... పెద్ద సినిమాలు ఒక ఏరియా కొనే మొత్తంతో ఒక మీడియం బడ్జెట్‌ సినిమా పంపిణీ హక్కుల్ని హోల్‌సేల్‌గా తీసేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. అందులో భాగంగానే వరుణ్ తేజ్ - రాశిఖన్నాలు జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన తొలిప్రేమను హోల్సేల్ గా కొని పంపిణి చేసిన దిల్ రాజుకి పెద్దగా లాభాలు రాకపోయినా.. ఒక హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు.

అలాగే నాని సినిమాల మీద ఉన్న నమ్మకంతో దిల్ రాజు కృష్ణార్జున యుద్ధం తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులు హోల్సేల్ గా తీసేసుకున్నాడు. కానీ ఈ కృష్ణార్జునతో దిల్‌ రాజుకి నష్టాలు తప్పేట్టు లేవు. ఎందుకంటే ఈ సినిమా మొదటి షోకే మిక్స్డ్ టాక్... రెండు రోజులకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. చిన్న సినిమాల మీదున్న నమ్మకం దిల్ రాజుని ఏ దారికి చేరుస్తుందో తెలియదు గాని.. పెద్ద సినిమాలు  నైజాంలో కొని నష్టపోవడం కరెక్ట్ కాదనుకుని ప్రస్తుతం సూపర్ హిట్ అయిన రంగస్థలం నైజాం హక్కులను దిల్ రాజు చేజేతులా వదులుకున్నాడు.  నైజాంలో రంగస్థలం చిత్రాన్ని 18  కోట్లకి కొనేందుకు దిల్‌ రాజు నిరాకరించాడు. దాంతో మైత్రి నిర్మాతలు యువి ద్వారా నైజాంలో స్వయంగా విడుదల చేసుకున్నారు. ఇప్పుడు నైజాంలోనే రంగస్థలానికి  ఇరవై అయిదు కోట్లకి పైగా షేర్‌ వస్తోంది. అలా దిల్ రాజు ఒక మంచి లాభాన్ని వదిలేసుకున్నాడు.

Why Dil Raju Lost Rangasthalam?:

Dil Raju wrong Steps Revealed in Distribution
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs