Advertisement
Google Ads BL

యంగ్‌టైగర్‌ చిన్నప్పటి ఫొటో వైరల్..!


యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌కి హరికృష్ణ, షాలినీలు తల్లిదండ్రులన్న విషయం తెలిసిందే. ఇక నందమూరి వంశంలో అందరి కంటే ఎక్కువగా తన తాతయ్యను పోలి ఉండటం జూనియర్‌లోనే ఎక్కువ. అదే ఆయనకు చిన్నతనంలోనే స్టార్‌ ఇమేజ్‌ని కట్టబెట్టింది. అతి చిన్నవయసులోనే ఆయన 'స్టూడెంట్‌ నెంబర్‌1, ఆది, సింహాద్రి, యమదొంగ, బృందావనం, అదుర్స్‌, బాద్‌షా, టెంపర్‌, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్‌' వంటి బ్లాక్‌బస్టర్స్‌ అందుకున్నాడు. ఇక ఈయన తల్లి షాలిని కన్నడకి చెందిన బ్రాహ్మణ యువతి, నాడు దాసరి నారాయణరావు పరిచయం చేసిన 'స్వప్న' హీరో రాజా.. ఎన్టీఆర్‌కి బాబాయ్‌ అవుతాడు. 

Advertisement
CJ Advs

ఇక ఎన్టీఆర్‌ ఇటీవలే 'జై లవకుశ'తో తన విశ్వరూపం చూపి ప్రస్తుతం హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బేనర్‌లో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్‌ మరలా 'యమదొంగ'లాంటి లుక్‌లోకి మేకోవర్‌ అయ్యాడు. ఈ చిత్రం షూటింగ్‌ తాజాగా రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభమైంది. ఇందులో రెండెకరాలలో రాయలసీమను పోలిన గ్రామం సెట్‌ని వేశారు. ఇందులో ఎన్టీఆర్‌ రాయలసీమకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా లేదా దీపావళికి పూర్తి చేసి ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న మల్టీస్టారర్‌ చిత్రంలో జాయిన్‌ అవుతాడు. 

ఇక ఎన్టీఆర్‌కి చెందిన ఓ చిన్ననాటి ఫొటోని ఎన్టీఆర్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా అది వైరల్‌ అవుతోంది. ఇందులో తన తల్లి షాలిని పక్కనే నిలబడి ఉన్న ఎన్టీఆర్‌ నోటిలో వేలు పెట్టుకుని ఆకట్టుకుంటున్నాడు. దాంతో ఈ ఫొటోని చూసిన వారు బుల్లి యంగ్‌టైగర్‌ ఫోటోని చూసి ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నారు. 

Jr NTR Childhood Pic Viral in Social Media:

Jr NTR with His Mother Shalini
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs