పోకిరి తర్వాత మళ్ళీ అంతటి హిట్ అందుకోలేక.. తిప్పలు పడుతున్న పూరి జగన్నాధ్ కి ఎన్టీఆర్ ఎంతో నమ్మకంతో టెంపర్ సినిమా ఇచ్చాడు. టెంపర్ సినిమాతో మళ్ళీ లైమ్ టైం లో కొచ్చిన పూరి జగన్నాధ్ వరుస ప్లాప్స్ తో మళ్ళీ కుదేలయ్యాడు. బాలకృష్ణ అంతటి వాడు పైసా వసూల్ ఛాన్స్ ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయిన పూరి జగన్నాధ్ ప్రస్తుతం తన కొడుకుని హీరోగా ఇండస్ట్రీకి మెహబూబా అనే ప్రేమ కథతో లాంచ్ చెయ్యబోతున్నాడు. ఎప్పుడూ ఫాస్ట్ గా మూవీ తీసేసి విడుదల చేసే పూరి తన కొడుకు ఆకాష్ సినిమాని మాత్రం చాలా ప్లాన్ గా జాగ్రత్తగా కొంచెం ఎక్కువ టైం తీసుకుని తెరకెక్కించడమే కాదు... సినిమా ఇప్పటికే సిద్దమైనప్పటికీ మాంచి టైంలో విడుదల చేసి హిట్ కొట్టాలని ఎదురు చూస్తున్నాడు.
ఇప్పటికే థియేట్రికల్ ట్రైలర్ తో ఆకట్టుకున్న మెహబూబా సినిమాలో ఆకాష్ పూరి నటన అందరిని కట్టి పడేసింది. నేహా శెట్టి అనే కొత్తమ్మాయిని కొడుకు పక్కన హీరోయిన్ గా దింపిన పూరి జగన్నాధ్ మెహబూబాతో మళ్ళీ హిట్ కొట్టేస్తాడనిపిస్తుంది. ఇప్పటికే మెహబూబా ట్రైలర్ మీద చాలామంది ప్రముఖులు పాజిటివ్ కామెంట్స్ చేశారు. అయితే సినిమాని మంచి టైంలో విడుదల చెయ్యాలని మే 11 న డేట్ ఫిక్స్ చేసిన పూరి ప్రస్తుతం మెహబూబా ప్రమోషన్స్ ని ఒక రేంజ్ లో చేపడుతున్నాడు. ఇప్పటికే పూరి కనెక్ట్స్ పేరుతో ఛార్మి అండ్ కో మెహబూబా ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లారు. ఛార్మి కూడా మెహబూబా పబ్లిసిటీ కార్యక్రమాల్లో ఆకాష్, నేహా శెట్టి లతో కలిసి స్పెషల్ గా పాల్గొనడమే కాదు... ఆమె ఈ మెహబూబా ప్రమోషన్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.
మరి ఆకాష్ హీరోగా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో తెలియదు గాని.. పూరి జగన్నాధ్ కి ఈ సినిమా హిట్ మాత్రం కీలకం కానుంది. ఎందుకంటే కొడుకు ఆకాష్ పూరీని హీరోగా నిలబెట్టే ప్రయత్నం సఫలం కావడంతో పాటే... ఈ సినిమా హిట్ తో తనకి స్టార్ హీరోల ఆఫర్స్ దక్కుతాయి. లేదంటే పూరి జగన్నాధ్ దర్శకుడిగా ఇక అతని పనైపోయినట్టే.