గత కొంతకాలంగా టాలీవుడ్‌లో పలు సంచలనాలు నమోదవుతూ ఉన్నాయి. పవన్ ఫ్యాన్స్‌కి, కత్తి మహేష్‌కి సంబంధించిన గొడవ తారాస్థాయికి చేరి సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో వెంటనే శ్రీరెడ్డి సీన్‌లోకి ఎంటర్ అయి కాస్టింగ్‌కౌచ్‌పై పలువురిపై పేర్లతో సహా బయటకి చెప్పి, తనకి జరిగిన అన్యాయంపై టాలీవుడ్ పునాదులు కదిలేలా చేస్తోంది. మరోవైపు 'మా' ప్రెసిడెంట్ శివాజారాజా తొందరపాటు తనమే శ్రీరెడ్డి బలం పెరగడానికి కారణమైంది. ఇక తాజాగా శ్రీరెడ్డి విషయంలో ఆమె పోలీసులను కలిసి కేసు ఫైల్ చేయడం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా మరలా కత్తి మహేష్ ఇచ్చిన అల్టిమేటం ఇండస్ట్రీని వణికిస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్టు అయిన సునీత అనే అమ్మాయి కత్తి మహేష్ తనపై అత్యాచారం చేయబోయాడని ఓ చానెల్‌లో చెప్పింది. దీంతో కత్తి మహేష్ మరింత రెచ్చిపోయాడు.
తెలుగు ఇండస్ట్రీలోని తప్పుల మీద తాను పోరాటం చేస్తుంటే తప్పులను సరిదిద్దుకోవాల్సిందిపోయి తననే టార్గెట్ చేస్తూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డాడు. తన క్యారెక్టర్‌ని బద్‌నాం చేయడానికే వారు ఇలా చెబుతున్నారని, తనపై చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, కానీ ఇప్పటి వరకు ఆ నటి ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని కత్తి మహేష్ అనుమానం వ్యక్తం చేశాడు. తాను 'సై..రా' ఆఫీసు నుంచి వస్తున్నానని చెబుతూ, వాకాడ అప్పారావు పేరు ఎత్తడం పట్ల దీని వెనుక మెగా క్యాంప్, కొణిదెల బేనర్ హస్తం ఉందనే అనుమానాన్ని కత్తి మహేష్ వ్యక్తం చేశాడు. తాను లాయర్‌తో సంప్రదిస్తున్నానని, 50లక్షలకు పరువు నష్టం దావా వేయనున్నానని, అందుకోసం కోర్టుకి 5లక్షలు డిపాజిట్ కట్టాల్సి ఉండటంతో తాను అదే పనిలో ఉన్నానని చెప్పాడు. తనపై ఆరోపణలు చేసిన సునీత అనే అమ్మాయితో నాకు పరిచయం ఉంది. కానీ దానిని ఆధారంగా చేసుకుని కట్టుకధ అల్లారు.
బహుశా ఆమెను చానెల్‌కి పంపించేటప్పుడు పూర్తిగా ఆ అమ్మాయిగా బాగా కోచింగ్ ఇవ్వలేదని ఆయన కౌంటర్ విసిరాడు. రెండు మూడు రోజుల్లో ఎందరో పెద్దల బాగోతాలు నేను బయటపెట్టబోతున్నాను. ఆ తర్వాత ఎవరి బతుకులు ఏమిటో అర్ధమవుతుంది...! పిల్లి బిత్తిరి వేషాలు నా వద్ద వేయవద్దు, నన్ను కెలకవద్దని పలు సార్లు చెప్పాను. కానీ కెలికారు. దాని పర్యవసానాలు అనుభవిస్తారు. మరో రెండు మూడు రోజుల్లో పలువురి బతుకులు రోడ్ల మీద ఉంటాయి అని చెప్పడంతో ఆయన చెప్పింది మెగాక్యాంప్ హీరోల మీదనే అని అర్ధమవుతోంది.