Advertisement
Google Ads BL

మెగా హీరోల స్ట్రాటజీ అర్థమైందా..?


నిన్నటికి నిన్న రంగస్థలం సినిమాతో బంపర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ తన సినిమాకి అదనపు ఆకర్షణ అవసరమని తన బాబాయ్ కి షో వేసి చూపిద్దాము అనుకుంటే.. లక్కీ గా చరణ్ పంట పండి పవన్ కళ్యాణ్, చరణ్ ని పిలిచి స్పెషల్ గా రంగస్థలాన్ని థియేటర్ లో మెగా ఫ్యాన్స్ తో కలిసి చూడడమే  కాదు... రంగస్థలం సినిమా విజయోత్సవంలో రంగస్థలాన్ని ఆస్కార్ కి పంపాలంటూ.. రంగస్థలాన్ని ఆకాశానికెత్తేసాడు. మరి ఇక్కడ చరణ్, బాబాయ్ మీద ఎంత ప్రేమగా ఉన్నప్పటికీ తన సినిమా ప్రమోషన్ కి ఆయన్ని వాడుకున్నట్టే... పవన్ కూడా మెగా ఫ్యాన్స్ ని చీలిపోకుండా తన రాజకీయాల కోసం తెలివిగా వారిని ఆపగలిగినట్లే.

Advertisement
CJ Advs

ఇక చరణ్ రంగస్థలం హిట్ ని కేవలం ట్వీట్ తో సూపర్ అన్న అల్లు ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ తన నా పేరు సూర్య కోసం మావయ్య చిరంజీవి క్రేజ్ ని వాడేసుకుంటున్నాడు. ఆదివారం మెగాస్టార్ చిరు అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు సూర్య సెట్స్ లో సందడి చెయ్యడమే కాదు.. అల్లు అర్జున్ డాన్స్ ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేశాడు. మరి మెగాస్టార్ చిరు నా పేరు సూర్య సెట్స్ లో చేసిన సందడితో మెగా ఫ్యామిలీ ఒకటే అనే అర్ధం వచ్చేలా ఉంది. మరి తమ సినిమాల కోసం మెగా హీరోలు ఎవరికీ వారే తమ ప్లాన్స్ ని వర్కౌట్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ విషయంలో చరణ్ సూపర్ సక్సెస్ సాధించగా.... అల్లు అర్జున్ నా పేరు సూర్య మే 4 న విడుదల కాబోతుంది... అప్పుడు గాని అల్లు అర్జున్ ప్లాన్ వర్కౌట్ అయ్యిందో లేదో తెలుస్తుంది. ఏది ఏమైనా మెగా హీరోలు చాలా తెలివైనవారు. తమకిష్టమైన వారితో ప్రేమగా ఉంటూనే... వారితో తమ పనులను చేయించేసుకుంటున్నారు.

Chiranjeevi Visits Naa Peru Surya Sets:

Pawan Kalyan for Ram Charan and Chiranjeevi for Allu Arjun
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs