Advertisement
Google Ads BL

పవన్ కళ్యాణ్ కళ్ళు.. రంగమ్మత్తకి గొంతు!


'జబర్ధస్త్‌'తో హంగామా మొదలైన రోజుల్లోనే యాంకర్‌ అనసూయ సినీరంగ ప్రవేశం గురించి వార్తలు వచ్చాయి. పవన్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లోవచ్చిన 'అత్తారింటికి దారేది' చిత్రంలో ఐటం సాంగ్‌లో నటించే అవకాశం నాడు వచ్చినా కూడా అనసూయ కేవలం ఐటంసాంగ్స్‌ అంటే చేయనని చెప్పడం, దాంతో మెగాఫ్యాన్స్‌కి టార్గెట్‌ కావడం తెలిసిందే. మరలా ఇన్నేళ్ల తర్వాత అనసూయ, పవన్‌కళ్యాణ్‌లు ఒకే వేదికపై కనిపించారు. 

Advertisement
CJ Advs

రంగస్థలం సక్సెస్ మీట్ కి ముఖ్యఅతిధిగా వచ్చిన పవన్‌ మాట్లాడుతూ, ఈ చిత్రం చూస్తుంటే తనకు పాత్రలు తప్ప, నటీనటులు కనిపించలేదని వ్యాఖ్యానించాడు. ఇక తాను ప్రీమియర్‌ చూసి బయటకు వస్తుంటే అనసూయ కనిపించిందని ఆమెకి తాను షేక్‌ హ్యాండ్‌ ఇచ్చానని తెలిపాడు. అప్పుడు అనసూయ ఈ చిత్రంలో రంగమ్మత్త పాత్ర చేసింది నేనే అని చెప్పడంతో తాను ఆశ్యర్యపోయి అటు చూశానన్నాడు. అంటే ఆయన దృష్టిలో ఆ అనసూయలో ఆ పాత్ర కనిపించిందే గానీ అనసూయ కనిపించలేదని అర్ధం. ఇలా పవన్‌ తన గురించి మాట్లాడుతున్నంత సేపు అనసూయ గర్వంతో ఆనందంగా ఉబ్చితబ్బిబవుతూ కనిపించింది.

ఇక ఈ వేడుకలో అందరు ప్రసంగించారు. కానీ అనసూయ మాత్రం మాట్లాడలేదు. ఆమె మాట్లాడుతుందని భావించిన వారు దీంతో నిరాశ చెందారు. దీనిపై తాజాగా అనసూయ స్పందించింది. నేను మాట్లాడుతానని భావించిన వారందరికీ సారీ అని ట్వీట్‌ చేసింది. నా ఆరోగ్యం బాగాలేనందువల్ల, గొంతు ఇబ్బంది ఉండటం వల్ల మాట్లాడలేకపోయానని తెలిపింది. అంటే పవన్‌ కళ్లకు ఇన్‌ఫెక్షన్‌ వస్తే కళ్లద్దాలు పెట్టుకున్నాడు. అదే సమయంలో రంగమ్మత్త గొంతుకి ఇన్‌ఫెక్షన్‌ రావడం కాకతాళీయమే...! 

Reason Behind Anasuya Not Speak On Rangasthalam Success Meet:

Anchor Anasuya Clarifies Why she didn't Talk at Rangasthalam SM
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs