ఎప్పుడు మెగా ఫ్యామిలిలో గొడవలు ఉన్నాయంటూ మీడియా హడావిడి చెయ్యడం కాదు.. మీడియా మెగా ఫ్యామిలీ మేటర్ తీసిన ప్రతిసారి మాలో గొడవలేం లేదంటూ రామ్ చరణ్ వంటి వారు క్లారిటీ ఇస్తుంటారు. కానీ నాగబాబు అయితే కాస్త గట్టిగానే స్పందిస్తుంటాడు... వాళ్ళ రిలేషన్ విషయంలో. మరి ఎప్పుడూ అంటీ ముట్టనుండే పవన్ కళ్యాణ్ ఇప్పుడు హఠాత్తుగా మెగా ఫ్యామిలీతో మంచి రిలేషన్ మెయింటింగ్ చేస్తున్నాడు. అన్న చిరుతో రాజకీయాలతో విభేదాల దగ్గరనుండి, చిరు చిన్న కూతురు శ్రీజ మొదటి పెళ్లి వ్యవహారంలోనూ పవన్ కళ్యాణ్ ఎంతగా ఇన్వాల్వ్ అయ్యాడో... తర్వాత తర్వాత అంటే పవన్ కి కొడుకు పుట్టిన దగ్గర నుండి మళ్ళీ మెగా ఫ్యామిలీతో సంబంధాలు కొనసాగిస్తున్నాడు.
కొడుకుని తీసుకుని అన్న ఇంటికెళ్ళడం, కొడుక్కి అన్న పేరు కలిసొచ్చేలా పెట్టడం, రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు పెద్ద కొడుకు అకీరాతో కలిసి చిరు ఇంటికెళ్ళడం... అంతేనా రామ్ చరణ్ తాజా చిత్రం రంగస్థలాన్ని చెర్రీ భార్య భర్తలతో కలిసి తన భార్య అన్నాతో కూడా సినిమాని చూడడం చేసిన పవన్ కళ్యాణ్ ఎందుకిలా చేస్తున్నాడో.. రాజకీయాల్లో మెగా ఫ్యామిలీ సపోర్ట్ కావాలనా ...లేదంటే మెగా హీరోగా తన తర్వాత తన అన్న కొడుకు చరణ్ ఫాలింగ్ పెంచడానికా.. అని అనుకునే లోపు రంగస్థలం విజయోత్సవం వేడుకల్లో అదిరిపోయే స్పీచ్ ఇవ్వడంతో.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో ఏర్పడిన చీలిక కూడా పోయేట్లుగానే కనబడుతుంది.
రామ్ చరణ్ - పవన్ కళ్యాణ్ లు రంగస్థలం స్టేజ్ మీద చూడగానే మెగా ఫాన్స్ కి పిచ్చెక్కేసింది. అలాగే పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో కలిసిపోయారు కూడా. అలాగే రామ్ చరణ్ కి పవన్ తో పాటు పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా దొరికేసింది. కాకపోతే పవన్ ఇలా ఉన్నట్టుండి మెగా ఫ్యామిలీకి ఎందుకు దగ్గరవుతున్నాడో అనేది చాలామందికి అంతుబట్టడం లేదు. అందులోను చరణ్ రంగస్థలానికి ఆస్కార్ కోసం పోరాడదామని నినాదం కూడా కొత్తగానే ఉంది. మరి రంగస్థలం స్టేజ్ మీద చరణ్ కి హాగ్ ఇవ్వడం దగ్గర నుండి... ముద్దు పెట్టడం వరకు కేవలం ప్రేమే అనుకోవాలా.. లేదంటే మరేదన్నానా అనేది మాత్రం బాగా థింక్ చెయ్యాల్సిన విషయమే.