Advertisement
Google Ads BL

ఇప్పటికైనా చికిత్స మొదలెట్టండి: తమన్నా!


జమ్మూకాశ్మీర్‌లోని కదువా జిల్లాలో 8ఏళ్ల బాలికపై ప్రార్ధనా స్థలంలోనే రేప్‌ చేసి, ఆ పాపని చంపేసిన ఘటన దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. ఆసిఫా అనే బాలికను ఇలా ఆరుగురు మృగాళ్లు కలిసి చేసిన ఉదంతంపై పలువురు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ సంఘటనపై పలువురు సోషల్‌ మీడియాలో దోషులని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇక ఓ బిజెపి ఎమ్మెల్యే, ఆయన సోదరుడు, తనపై అత్యాచారం చేశారని ఉన్నావ్‌ బాధితురాలు పేర్కొంది. 

Advertisement
CJ Advs

ఈ ఘటన తర్వాత బాధితురాలి తండ్రి పోలీస్‌ కస్టడీలో మరణించడం మరింతగా ఈ నేరం తీవ్రతను పెంచింది. మరోవైపు కఠువా సంఘటన మూడు నెలల కిందటే 8ఏళ్ల గుజ్జార్‌ యువతిని ఒక మాజీ ప్రభుత్వాధికారి, ఆయన మేనల్లుడు, కుమారుడు కలసి మరికొందరు పోలీస్‌ అధికారులతో ఎత్తుకెళ్లి కొన్నేళ్ల పాటు బలవంతంగా రేప్‌ చేసి చంపారు. ఈ గుజ్జార్‌ తెగవారే నాడు కార్గిల్‌ యుద్దం సమయంలో పాకిస్తాన్‌ చొరబాటు దారులను గుర్తించి భారత సైన్యానికి ఎంతో సాయం చేశారు. 

ఇక దీనిపై తమన్నా తాజాగా స్పందించింది. జమ్మూకాశ్వీర్‌లో 8ఏళ్ల బాలిక, మరోచోట 16ఏళ్ల యువతి అత్యాచారానికి గురయ్యారు. దీనిపై పోరాడిన అతని తండ్రిని కొట్టి చంపేశారు. నేరస్థులను కాపాడేందుకే ఇలా జరిగింది. ఈ సంఘటనలు చూస్తుంటే దేశం ఎటుపోతోంది అని బాధ కలుగుతోంది. మహిళలను కాపాడలేకపోతే దేశం తిరోగమనంలోకి వెళ్తుంది. ఇప్పటికైనా దీనికి చికిత్స చేయాలని కోరింది...!

Tamanna Bhatia Gets Emotional About Asifa:

Tamanna suggestions to governments
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs