Advertisement
Google Ads BL

'భరత్ అనే నేను' పబ్లిసిటీ ఇరగదీస్తున్నారు!


సంక్రాంతి సీజను తెలుగుని నిరాశ పరచినా కూడా తర్వాత వచ్చిన 'భాగమతి, తొలిప్రేమ, ఛలో'వంటి హిట్స్‌తో పాటు 'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్‌ కూడా వచ్చింది. ఇక ఈ చిత్రం ఈనెల 20వ తేదీన విడుదలకు 'భరత్‌ అనే నేను' సిద్దంగా ఉండటంతో ప్రమోషన్స్‌ వేగాన్నికూడా బాగా పెంచారు. ఆడియో వేడుక నుంచి సాంగ్స్‌ సింగిల్స్‌ని విడుదల చేస్తూ సాంగ్స్‌ ప్రోమోలతో ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలోని పాటలు దేవిశ్రీప్రసాద్‌ స్వరకర్తగా, రామ జోగయ్య శాస్త్రి సాహిత్యంతో ఓ ఊపు ఊపుతున్నాయి. ఇక ఆండ్రియా, ఫరాన్‌ అక్తర్‌ పాడిన పాటలతో పాటు తాజాగా విడుదల చేసిన 'వసుమతి' పాట కూడా అదరగొడుతోంది. ఇందులో అందమైన సెట్‌లో వెరైటీ కాస్ట్యూమ్స్‌తో మహేష్‌ కూడా డిఫరెంట్‌గా ఉన్నాడు. 

Advertisement
CJ Advs

ఇక 'శ్రీమంతుడు' ప్రమోషన్‌ బాధ్యతలను తానే తీసుకుని మంచి మార్కెటింగ్‌ మేనేజర్‌గా పేరున్న నమ్రతా ఆ చిత్రం కలెక్షన్లు సాధించడం, స్టడీగా చిత్రం కలెక్షన్లు ఉండేలా చేయడంలో ఎంతో శ్రద్ద తీసుకుంది కానీ ఆ తర్వాత 'బ్రహ్మూెత్సవం, స్పైడర్‌' వంటి చిత్రాల విషయంలో ఆమె జోక్యం చేసుకోలేదు. తన కూతురు పెంపకంలో పడిపోయింది. మరల నమ్రత 'భరత్‌ అనే నేను' ప్రమోషన్‌ బాధ్యతలను తీసుకుంది. ఈ చిత్రాన్నిసోషల్‌ మీడియాలో ప్రమోట్‌ చేసేందుకు ఓ టీమ్ ని ఏర్పాటు చేసి ఒక్క హైదరాబాద్‌లోనే 200వరకు హోర్డింగ్స్‌ని పెడుతోంది. రెండు తెలుగు రాష్ల్రాలలో కలిపి 400 వరకు హోర్డింగ్ లు పెట్టనున్నారట. ఇక తాను రాసిన పాటల రాగాలలో కనిపించే రామజోగయ్య శాస్త్రి 'శ్రీమంతుడు'లో కూడా 'రామా రామా' అనే పాటలో మొదట్లో కనిపించాడు.

తాజాగా ఆయన 'వచ్చాడయ్యా స్వామి' పాటలో కూడా మెరవబోతున్నాడు. ఈయన విడుదల చేసి, దేవిశ్రీకి, రాజు సుందరంకి తెలిపిన థ్యాంక్స్‌, లుక్‌కి మంచి స్పందన వస్తోంది. దాంతో రామజోగయ్య శాస్త్రి కూడా ఈ చిత్రంలో కనిపించనుండటంతో 'శ్రీమంతుడు' మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందనే సెంటిమెంట్‌ కూడా ఉంది. ఇక ఈ చిత్రం నైజాం రైట్స్‌ని 22కోట్లకు అమ్మారు. మహేష్‌కి నైజాంలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. దాంతో నైజాంలోని కొన్ని ఏరియాలను డైరెక్టర్‌ కొరటాల శివ సొంతం చేసుకున్నాడని తెలుస్తోంది. దాంతో ఆయనకు 'భరత్‌ అనే నేను'పై ఉండే నమ్మకం అర్దమవుతోందనే చెప్పాలి. 

Bharat Ane Nenu Publicity in Full speed:

High Level Publicity to Bharat Ane Nenu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs