Advertisement
Google Ads BL

'రంగస్థలం' రికార్డ్స్ వేట ఇంకా ఆగలేదు!


నాని.. కృష్ణార్జున యుద్ధం సినిమా రాకతో రంగస్థలం కలెక్షన్స్ కి బ్రేక్ పడే అవకాశం ఉందని...వసూల్ విషయంలో రామ్ చరణ్ వెనక్కి తగ్గే పరిస్థితి వస్తుందని అంత అనుకున్నారు. కానీ కృష్ణార్జున యుద్ధం సినిమా నిరాశ పరచడంతో.. రామ్ చరణ్ రంగస్థలం సినిమా మరోసారి బాక్సాఫీస్‌ని డామినేట్‌ చేస్తోంది. రంగస్థలం సినిమా శనివారం ఉదయం షో నుండే హౌస్‌ఫుల్స్‌ నమోదవుతున్నాయి. ఆదివారం అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది.

Advertisement
CJ Advs

ఈ రెదను రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుండి 4 కోట్లు షేర్ ను వసూల్ చేయడం కాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. ఇదే కనుక జరిగితే రామ్ చరణ్ తన తండ్రి రీసెంట్ మూవీ 'ఖైదీ నంబర్‌ 150' రికార్డుని క్రాస్ చేయడం ఖాయం. రికార్డ్స్ పరంగా ఈ సినిమా రోజుకి ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. రెండు వారాల్లోనే వంద కోట్లకి పైగా షేర్‌ ను సాధించి రంగస్థలం కొత్త రికార్డు నమోదు చేసింది.

ఈ జోరు 'భరత్‌ అనే నేను' వచ్చే వరకు కొనసాగనుంది. మహేష్ సినిమా టాక్ బాగుండి హిట్ అయినా కూడా.. రంగస్థలం ఫుల్‌ రన్‌లో నూట పది కోట్ల షేర్‌ అయితే గ్యారెంటీ అని ట్రేడ్‌ ఘంటాపథంగా చెబుతోంది. మహేష్ సినిమా కూడా ఇదే పాజిటివ్ టాక్ ఉంటే..  ఆ సినిమా కూడా వంద కోట్ల క్లబ్ లో చేరటం ఖాయం అని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

Rangathalam Creates One More Record:

One More Record to Ram Charan Rangasthalam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs