Advertisement
Google Ads BL

'ఎన్టీఆర్'కి ఈవిడ కండీషన్స్ ఎక్కువైనాయ్..!


బాలకృష్ణ ఎంతో ప్రతిష్ట్మాకంగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ 'ఎన్టీఆర్' సినిమా గత నెల 29 నే ప్రారంభమైంది. దర్శకుడు తేజ ఈ 'ఎన్టీఆర్' సినిమా కోసం తాను చెయ్యాల్సిన వెంకటేష్ 'ఆటా నాదే వేట నాదే' సినిమాని కూడా పక్కన పెట్టేశాడు. షూటింగ్ మొదలు పెట్టిన రోజు నుండి రెండు రోజుల పాటు 'ఎన్టీఆర్' సినిమా షూటింగ్ జరిగింది. అయితే మహానటుడు 'ఎన్టీఆర్' బయోపిక్ లో ఎన్టీఆర్ భార్య పాత్ర కోసం హీరోయిన్స్ వేట కొనసాగుతుంది. ఇప్పటికే 'ఎన్టీఆర్' బయోపిక్ లో నటించే నటీనటుల ఎంపిక జరుగుతుంది. అయితే ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రకి మాత్రం ఇంతవరకు ఇంకా హీరోయిన్ సెట్ కాలేదు. కాకపోతే బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ పేరు మాత్రం 'ఎన్టీఆర్' వైఫ్ పాత్రకి గట్టిగా వినిపిస్తున్న పేరు.

Advertisement
CJ Advs

అయితే ఈ పాత్ర చెయ్యడానికి విద్యాబాలన్ కూడా సానుకూలంగా ఉందని... కాకపోతే కండిషన్స్ అప్లై అంటుందట. అందుకే తనతో చర్చించిన 'ఎన్టీఆర్' చిత్ర టీమ్ కి తన కండిషన్స్ చెప్పి ఓకె అంటేనే అగ్రిమెంట్ అన్నట్టుగా మాట్లాడుతుందట. ఇంతకీ 'ఎన్టీఆర్‌' బయోపిక్ లో భార్య బసవతారకం పాత్రకి ఎక్కువ స్కోప్‌ వుండకపోవచ్చునని విద్యాబాలన్‌ మేనేజర్స్‌ చెప్పడంతో... అసలు 'ఎన్టీఆర్' సినిమాలో తన పాత్ర నిడివి ఏమిటి, ఎన్ని సన్నివేశాలుంటాయి అనే విషయాన్ని దర్శకనిర్మాతలను అడుగుతుందట. అలాగే తనతో తీసిన సన్నివేశాలన్నీ ఫైనల్ గా ఉంచాలని.. లేదంటే ఎడిటింగ్ లో తీసేసి కేవలం గెస్ట్ పాత్ర మాదిరిగా తన పాత్రని చెయ్యకూడదని కండిషన్స్ పెడుతుందట.

ఇక కండిషన్స్ ని ఒప్పుకుంటే సరిపోదని తనకి రాత పుర్వకంగా రాసిస్తేనే 'ఎన్టీఆర్' బయోపిక్ లో నటిస్తానని కండిషన్స్ పెడుతుందట విద్యాబాలన్. మరి నిర్మొహమాటంతో ఇలా కండిషన్స్ పెడుతున్న విద్యాబాలన్ అగ్రిమెంట్ ని ఒప్పుకోవాలా వద్దా... అనే మీమాంసలో పడిందట 'ఎన్టీఆర్' చిత్ర యూనిట్. మరి బాలీవుడ్ లో ఓ అన్నంత అవకాశాలు లేకపోయినా.. కానీ తెలుగులో మాత్రం తన పాత్ర హీరోతో సమానంగా ఉండాలి అంటే ఎలా అంటూ టాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

Vidya Balan Conditions to NTR Biopic:

Vidya Balan put conditions for NTR Biopic
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs