Advertisement
Google Ads BL

కాస్టింగ్‌కౌచ్‌పై పూజా హెగ్డే ఇలా..!


మొత్తానికి శ్రీరెడ్డి ఏ ఉద్ధేశ్యంతో అయితే కాస్టింగ్‌ కౌచ్‌, బలవంతపు సెక్స్‌, అవకాశాల పేరుతో లొంగ తీసుకోవడం వంటి వాటిపై కామెంట్స్‌ చేసిందో అన్నిచోట్లా విపరీతమైన చర్చ దానిపైనే సాగుతోంది. శ్రీరెడ్డి పుణ్యాన ఏ అమ్మాయితో ఎలా చాటింగ్‌ చేస్తే తాము కూడా ఇరుక్కుంటామేమోనని సాధారణ మగాళ్లు కూడా భయపడే పరిస్థితి రావడం మంచిదే. ఇక ఈ తతంగం ఇంత దూరం వెళ్లిన తర్వాత దీనిపై కమిటీలు వేస్తామని మా ప్రకటించడం వృధా ప్రయాసే. ఎందుకంటే కేవలం ఐదారుగురి చేతుల్లో, రెండు మూడు కులాల గుప్పిట్లో ఉన్న టాలీవుడ్‌లో ఈ కమిటీ వల్ల వచ్చే లాభం ఏమి లేదు. అయినా తమలో తామే కమిటీలు వేసుకోవడం ఏమిటో అర్ధం కాదు. ఒకవైపు లీగల్‌ చర్యలకు కోన వెంకట్‌ రెడీ అంటుంటే శ్రీరెడ్డి కూడా డీ అంటోంది. ఇక దీనిపై తమ్మారెడ్డి భరద్వాజ నుంచి శ్రీవాణి వరకు పలువురు శ్రీరెడ్డి చెప్పిందే నిజమని అంటున్నారు. 

Advertisement
CJ Advs

శ్రీరెడ్డి ఏమో తాను పోస్ట్‌ చేసిన ఫొటోలలో తాను నవ్వుతూ ఉండటంపై వస్తున్న విమర్శలకు స్పందించింది. మేమేమైనా కెమెరాలను మెడలో వేసుకుని తిరుగాతామా? మాకిష్టం లేకపోయినా నవ్వుతూ అనుభవించాల్సిందే. సరైనా మూమెంట్‌లో ఫొటో తీయడం ఎవరికైనా ఎలా సాధ్యమవుతుంది? అంటోంది. ఈ వాదనలో కూడా నిజం ఉంది. మరోవైపు నటి శ్రీవాణి శ్రీరెడ్డి చెప్పిన మాటలు వాస్తవమేనని, కానీ ఆమె వద్ద ఉన్నట్లు అందరు మహిళల వద్ద ఆధారాలు ఉండవని అంటోంది. 

ఇక ఈ విషయంలో డిజె భామ పూజాహెగ్డే కూడా స్పందించింది. తనకు కాస్టింగ్‌కౌచ్‌ ఇప్పటి వరకు ఎదురుకాలేదని, కానీ దానిని ఎదుర్కొన్న వారు చెబుతుంటే ఎంతో బాధగా ఉంటోందని చెబుతోంది. ఈ ఇండస్ట్రీకి ఎందరో ఎన్నో ఆశలతో వస్తుంటారు. నటిగా పేరు తెచ్చుకోవాలని, డబ్బు సంపాదించాలని వచ్చేవారి పట్ల ఇలా ప్రవర్తించడం దారుణమని ఆమె వ్యాఖ్యానించింది. లైంగిక వేధింపులపై గట్టిగా పోరాటం చేయాలి. అయితే అందరు కలిసి ఉద్యమిస్తేనే దీనికి ఫలితం వస్తుంది. ఇది ఏ ఒక్కరో చేసే పోరాటం కాదు. అందరు కలిసి పోరాడకపోతే ఈ లైంగిక వేధింపులు అనేవి కేవలం వార్తలుగానే మిగిలిపోతాయని తెలిపింది. మరి ముందుగా ఆమె ఓ అడుగు ముందుకు వేయచ్చు కదా...! అందరినీ కలుపుకుని ఆమె పోరాటం చేయడానికి ఏమిటి ఇబ్బంది? ఇక ఈమె ప్రస్తుతం ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ చిత్రంలో, వంశీ పైడిపల్లి-మహేష్‌-దిల్‌రాజు,-అశ్వనీదత్‌ల కాంబినేషన్‌లో రూపొందే చిత్రంతో పాటు 'సాహో' తర్వాత ప్రభాస్‌ 'జిల్‌' రాధాకృష్ణతో చేసే చిత్రంలో కూడా ఈమె భారీ అవకాశాలను అందుకుంటూ ఉంది...!

Pooja Hegde Reacts on Casting Couch:

Celebrities Supoort to Sri Reddy Fight
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs