Advertisement
Google Ads BL

అది నాగ చైతన్య దగ్గరే నేర్చుకున్నా: సమంత!


టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ నాగ చైతన్య - సమంతల వివాహం గత అక్టోబర్ లోనే జరిగినా.. ఇప్పటికి వీరిని ఇంకా కొత్త జంటగానే చూస్తుంది మీడియా. అంతేగా మరి... కొన్ని రోజులు స్నేహం, మరి కొన్ని రోజుల ప్రేమ, ఎవ్వరికి అనుమానమే రాకుండా మెయింటింగ్ చేసిన ఈ జంట మీడియాకి దొరకడం, ఎంగేజ్మెంట్ పెళ్లి విషయాల్లో ఏ జంట హైలెట్ కానంతగా హైలెట్ అయ్యింది. ఇక పెళ్లి తర్వాత కూడా ఎవరి సినిమాల్లో వారు బిజీగా మారిపోయారు. సమంత తాజా చిత్రం రంగస్థలం హిట్ కాగా... మహానటి సినిమా విడుదల కావాల్సి ఉంది. అలాగే సమంత మరో మూవీ కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Advertisement
CJ Advs

పెళ్లి తర్వాత కూడా గ్లామర్ పాత్రలతో రెచ్చిపోతున్న సమంత ముద్దు సీన్లకి కూడా మొహమాట పడడం లేదు. కథ డిమాండ్ చేస్తే ముద్దు సీన్స్ కి కూడా రెడీ అంటుంది. అయితే గ్లామర్ పాత్రలకు, ముద్దు సీన్స్ కి మీ భర్త నుండి ఎటువంటి అభ్యంతరాలు రావా అని సమంతని ప్రశ్నించగా.. అసలు సమంత సినిమాల స్క్రిప్ట్ గురించిన డిస్కర్షన్ చైతు దగ్గర తియ్యదట. అసలు ఇద్దరు వున్నప్పుడు వారే సినిమాల్లో నటిస్తున్నారో.. ఆయా సినిమాల్లో వారి పాత్రల గురించిన డిస్కర్షన్స్ పెట్టి టైం వేస్ట్ చేయడం.. అస్సలు నచ్చదని చెబుతుంది సమంత. 

అలాగే సినిమా ప్లాప్ అయినప్పుడు కూడా ప్రశాంతంగా, ధైర్యంగా ఉండడం నాగ చైతన్యని చూసే నేర్చుకున్నానని చెబుతుంది సామ్.  చైతూ... ప్రతీ సినిమా కోసం నూటికి నూరు శాతం కష్టపడి పనిచేస్తాడు. సినిమా ఫ్లాపయినా పట్టించుకోడు. ఎందుకు అని అడిగితే... మనం ఫీలవుతున్నామని ఆడియెన్స్ వెళ్లి సినిమాలు చూడరు కదా....అంటూ నవ్వేస్తాడు... అంటూ చైతుని చూసి తానెంతో నేర్చుకున్నానని చెబుతుంది ఈ చైతు ముద్దుల భార్య సమంత.

Samantha Learned This from Naga Chaitanya:

Samantha says she doesn't discuss work with husband Chaitanya
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs