Advertisement
Google Ads BL

'ఆట నాదే వేట నాదే' ఆగిపోవడానికి కారణం?


'గురు' సినిమా తర్వాత వెంకటేష్ భారీ గ్యాప్ తీసుకుని 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు తేజతో 'ఆటా నాదే వేట నాదే' అంటూ ఒక సినిమాని గత డిసెంబర్ లోనే స్టార్ట్ చేసాడు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రలో కనిపిస్తాడని ప్రచారం జరిగింది. కేవలం ప్రచారమే కాదు.. వెంకీ, తేజ దర్శకత్వం చెయ్యబోయే 'ఆట నాదే వేటా నాదే' సినిమాలో స్టైలిష్  ప్రొఫెసర్ గా ఒక లుక్ బయటికి కూడా వచ్చింది. కానీ తేజ - వెంకటేష్ ల 'ఆట నాదే వేట నాదే' సినిమా అధికారికముగా ఆగిపోయింది. అయితే వెంకటేష్ తేజ సినిమా ఆగిపోయినా.... మరో సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలోని, ఇంకో సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' సినిమాలో వెంకీ నటించాల్సి ఉంది.

Advertisement
CJ Advs

అయితే 'ఆట నాదే వేట నాదే' సినిమా ఆగిపోవడానికి కారణం తేజ, బాలకృష్ణతో చెయ్యబోయే 'ఎన్టీఆర్ బయోపిక్' పనుల్లో బిజీగా ఉండడంతో వెంకీ సినిమాని తేజ పక్కన పెట్టేసినట్లుగా తెలుస్తుంది. అయితే వెంకటేష్.. తేజ సినిమా ఆగిపోయినా.. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో 'ఎఫ్ 2' కోసం రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తేజ, ఎన్టీఆర్ బయో పిక్ పనుల్లో బిజీ అయితే... ప్రస్తుతం త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ తో చెయ్యబోయే సినిమాతో బిజీగా ఉన్నాడు. అందుకే ప్రస్తుతం ఖాళీగా వున్న అనిల్ రావిపూడి తో వెంకీ సినిమా చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఇప్పటికే అనిల్ రావిపూడి టైటిల్ తో సహా ఓకే అనిపించుకుని .. ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టేసి ముందున్నాడు. అందువలన అనిల్ రావిపూడితోనే వెంకటేశ్ సెట్స్ పైకి వెళుతున్నాడని సమాచారం. మరి అనిల్ కోసం వెంకీ రెడీ అయితే ఈ సినిమాలో నటించబోయే  మరో హీరో వరుణ్ తేజ్ ఖాళీ అవ్వాలిగా. మరి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోయే 'ఎఫ్ 2' సినిమా వెంకటేష్ - వరుణ్ తేజ లతో కలిసి మల్టీస్టారర్ సినిమాగా ఉండబోతుంది... అందుకే వెంకీ ఫ్రీ అయినా... వరుణ్ ఫ్రీ అవ్వాలిగా అన్నది. అయితే వరుణ్ తేజ్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు.

Teja shelves Venky's project for Balayya?:

Balakrishna forced director Teja to shelve his project with Victory Venkatesh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs