రంకు, బొంకు ఎక్కువ కాలం బయటికి రాకుండా ఉండవని పెద్దలు చెబుతారు. ఇక సుచీలీక్స్ సమయంలో కోలీవుడ్ ప్రముఖులందరూ ఒకటై, సుచిత్రని ఆమె భర్తని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వారు ఆమెని అసలు కనిపించకుండా చేశారో ఎమో గానీ సుచిత్ర ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఏమిచేస్తోంది? కూడా తెలియదు. అసలు ఆమె బతికేఉందా? అనే సందేహాలు కూడా కొందరిలో ఉన్నాయి. ఇక ఈమె ట్విట్టర్‌ని హ్యాక్ చేశారని, ఆమె మానసికస్థితి సరిగా లేదని, ఆమె భర్తచేతే చెప్పిస్తున్నారు. పోలీసులను అడిగితే మాకెవ్వరూ ఫిర్యాదు చేయలేదు అంటున్నారు. ఇక పోలీసులే ఆ మాట అంటుంటే ఇక బాధితురాలి తరపున అండగా ఉండేది ఎవరు? అన్నప్రశ్న రాకమానదు. అయినా ఆమె లీక్స్ చేసిన ఫోటోలు, వీడియోలు నిజమోకాదో తేల్చాలి గానీ ఆమె మానసిక పరిస్థితి, డిప్రెషన్, ఫస్ట్రేషన్ గురించి మాట్లాడటం విషయాన్ని తప్పుదోవ పట్టించడానికే.
ఇక సుచీలీక్స్‌లో మన ప్లేబోయ్‌గా పేరొందిన రానా ఫోటోలు బయటికి వస్తే శ్రీరెడ్డి లీక్స్‌లో ఆయన సోదరుడు అభిరామ్ బుక్కయ్యారు. వీరి ధోరణే అంత అని ఇండస్ట్రీలో పలువురు చెవులు కొరుక్కుంటూ ఉంటారు. వెంకటేష్, సురేష్‌బాబులు మంచివారే గానీ రానా, ఆయన సోదరుడు మాత్రం జల్సారాయుళ్లని ప్రచారం ఉంది. ఇక ఈ విషయంలో శ్రీరెడ్డి ఇప్పటివరకు పోలీస్‌లకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చిన్న చిన్న నటీమణులు వ్యభిచారం కేసులో పట్టుబడితే చూపిందే చూపించే చానెల్స్ మాత్రం ఇప్పుడు శ్రీరెడ్డి లీక్స్‌లో పెద్దల ప్రమేయం, కొందరి గుత్తాదిపత్యం, కులం కంపు ఎక్కువ కావడంతో మౌనంగా ఉంటున్నాయి. శ్రీరెడ్డికి ముందు.. 'మా' సభ్యత్వమే ఇవ్వమని తేల్చారు. అయినా ఇదేం నియంత పోకడో అర్ధం కాకుండా ఉంది.
'మా' తీరు చూస్తుంటే దొంగలే దొంగా దొంగా అని అరిచినట్లు, పెద్దల పేర్లు బయటికి రాకుండా శ్రీరెడ్డిని బెదిరింపు ధోరణితో బెదిరిస్తున్నారని అర్ధమవుతోంది. శ్రీరెడ్డి వైపు నుంచి కూడా తప్పులు ఉండవచ్చు. అలాగే ఆమె చేసే ఆరోపణల్లో కూడా నిజం ఉందని అందరూ నమ్ముతున్నారు. ఇలా తమ పేర్లు బయటికి రాకుండా ఉండటానికే తేజ, సురేష్‌బాబులు 'వెంకటేష్' చిత్రంలో అవకాశం ఇస్తామని చెప్పినట్లుగా రాజీ ధోరణికి వచ్చారని అర్ధమవుతోంది.
ఇక దీనిపై రచయిత, నిర్మాత కోనవెంకట్ మాట్లాడుతూ, శ్రీరెడ్డి తనపై మిగిలిన వారిపై చేస్తున్న ఆరోపణలు చీప్ పబ్లిసిటీ కోసం చేస్తోంది. ఈ విషయంలో పోలీసులు, ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ జరపాలి. దోషులపై తీవ్ర చర్యలు తీసుకోవాలి అని అంటున్నాడు. అదే కోనవెంకట్ స్వయంగా తనపై వచ్చిన ఆరోపణలపై ఆయనే శ్రీరెడ్డి మీద ఎందుకు కేసు పెట్టకూడదు? అనే అనుమానం రావడం సహజం. ఇక తెలుగు సినిమాలలో తెలుగు నటీనటులే నటించాలనే విషయంలో తాను కూడా ఆమెకి మద్దతు ఇస్తానని, నేను తీసిన 'గీతాంజలి' చిత్రంలో అందరు తెలుగు వారే అని ఆయన అంటున్నాడు. మొత్తానికి సుచిలీక్స్ కంటే శ్రీరెడ్డి లీక్స్ డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉన్నాయనే చెప్పాలి.