సుకుమార్, మహేష్‌బాబుల కాంబినేషన్‌లో 14రీల్స్ సంస్థ నిర్మించిన '1' (నేనొక్కడినే) చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ చిత్రం క్లాస్ ఆడియన్స్‌ని, మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ని, ఓవర్‌సీస్‌లో అలరించినా కూడా చిత్రం కమర్షియల్‌గా ఫ్లాప్ అయింది. ఆచిత్రం నుంచి నేర్చుకున్న గుణపాఠంతోనే తాను అందరికీ అర్ధమయ్యేలా సినిమాలు తీయాలనే నిర్ణయానికి వచ్చి 'రంగస్థలం' తీశానని సుకుమార్ చెబుతున్నాడు. ఇక 'రంగస్థలం' విషయానికి వస్తే యూనిట్‌తో పాటు అందరు సూపర్‌హిట్ చిత్రం అవుతుందని మాత్రం ఆశించారు. కానీ సామాన్య ప్రేక్షకులు మాత్రం సుకుమార్ మరోసారి తన తెలివితో ప్రేక్షకుల జీకేకి, ఐక్యూకి టెస్ట్ పెడతాడేమోనని ఎంతో టెన్షన్ పడ్డారు. కానీ ఈ చిత్రం అందరు ఊహించిన దాని కంటే 100రెట్లు అధికంగా ప్రేక్షకులను అలరిస్తోందనేది నిజం. దీనికి ఇప్పటికీ కలెక్షన్లు స్టడీగా వస్తుండటంతో నాన్‌బాహుబలి రికార్డులో తర్వాత స్థానంలో ఉన్న చిరంజీవి 'ఖైదీనెంబర్ 150' చిత్రాన్ని సునాయాసంగా అధిగమిస్తారనే చెప్పవచ్చు.
కానీ ఈ చిత్రం నిర్మించేటప్పుడు సహజంగానే సుకుమార్ తన సినిమాలను జక్కన్న తర్వాత బాగా చెక్కుతాడనే విషయం తెలిసిందే. ఇక గోదావరి జిల్లాలలో జనాల మద్య షూటింగ్ చేయడం, ఇతర ఇబ్బందుల వల్ల ఏకంగా గోదావరి జిల్లాలను ప్రతిబింబించే సెట్స్ వేయాల్సివచ్చింది. ఈ చిత్రం అనుకున్న దాని కన్నా ఐదారు కోట్లు బడ్జెట్ ఎక్కువైందని సమాచారం. దాంతో ఇప్పటికే 'శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్థలం' చిత్రాలతో మొదటి మూడు చిత్రాలను హ్యాట్రిక్‌గా కొట్టి, 'శ్రీమంతుడు'తో ఇండస్ట్రీ హిట్, 'జనతాగ్యారేజ్'తో ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు 'రంగస్థలం'తో తిరుగేలేని ఇండస్ట్రీ హిట్‌లను కొట్టిన మైత్రిమూవీమేకర్స్ అధినేతలు ఈ చిత్రం ఫలితంలో తేడా వస్తే ఎక్కువ బడ్జెట్ కావడం వల్ల నష్టాలు వస్తాయేమో అనే ముందు చూపుతో సుకుమార్ చేత తదుపరి చిత్రం కూడా తక్కువ బడ్జెట్‌తో సినిమా తీస్తామని, 'రంగస్థలం'కి నష్టాలు వస్తే తమ తదుపరి చిత్రాన్ని సుకుమార్ తక్కువ రెమ్యూనరేషన్‌కి చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నారట.
ఇక 'రంగస్థలం' చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచే సరికి 'శ్రీమంతుడు' తర్వాత 'జనతాగ్యారేజ్'ని కొరటాల శివతోనే చేసినట్లు 'రంగస్థలం' తర్వాత సుకుమార్‌తోనే తమ తదుపరి చిత్రం చేయడానికి మైత్రి మూవీమేకర్స్ సంస్థ సిద్దమవుతోంది. ఇక ఇందులో మహేష్‌బాబుని హీరోగా పెట్టుకున్నారని సమాచారం. ప్రస్తుతం మహేష్ 'భరత్ అనే నేను' తర్వాత తన 25వ చిత్రంగా దిల్‌రాజు-అశ్వనీదత్‌ల కాంబినేషన్‌లో వంశీపైడిపల్లితో చిత్రం చేయనున్నాడు. వంశీ పైడిపల్లితో పాటు సమాంతరంగా సుకుమార్, మైత్రిమూవీమేకర్స్, మహేష్‌ల చిత్రం షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. మొత్తానికి నాలుగేళ్ల కిందట వచ్చిన 1నేనొక్కడినే చిత్రం కమర్షియల్‌గా ఫ్లాప్ అయినా కూడా మహేష్.. సుకుమార్‌ని నాడు కూడా పొగడ్తల వర్షంలో ముంచెత్తి, ఈ చిత్రం పరాజయానికి సుకుమర్ కారణం కాదని చెప్పాడు. అనుకున్నట్లుగానే ఆయన ఇప్పుడు కొత్త చిత్రాన్ని ఆయనతోనే కలిసి మైత్రిమూవీ మేకర్స్‌లో చేయనుండటం విశేషం. ఇది సుకుమార్‌తో మహేష్‌కి రెండో చిత్రం, మహేష్‌కి సుకుమార్‌తో రెండో చిత్రం, సుకుమార్‌తో మైత్రి మూవీమేకర్స్‌కి రెండో చిత్రం వంటి పలు విశేషాలు ఇందులో ఉన్నాయి.