Advertisement
Google Ads BL

మాధవిలత పెట్టిన పోస్ట్ చూశారా..?


తప్పు శ్రీరెడ్డిది కూడా కొంచెం ఉన్నా ఆమె చేస్తున్న ఆరోపణలైతే పూర్తిగా తప్పు అని ఖండించలేం. ఈమె చెబుతున్న విషయాలన్నీ వాస్తవాలే. అయితే వారికి లొంగిపోవడం అనేది మాత్రం శ్రీరెడ్డి తప్పు. ఇక ఈమెపై తమ ప్రతాపం చూపించిన 'మా' అసోసియేషన్‌ది కూడా నియంత ధోరణే. ఇక శ్రీరెడ్డి చూపుతున్న సాక్ష్యాలను సినిమా యాడ్స్‌ ఆదాయం ఎక్కడ చేజారుతుందో అని మన చానెల్స్‌ వారి ఫొటోలను బ్లర్‌ చేస్తూ చూపిస్తున్నాయి. 

Advertisement
CJ Advs

అదే చిన్నవారైతే విచ్చలవిడిగా చూపిందే చూపించే చానెల్స్‌ దీని వెనుక పెద్ద తలలు కూడా ఉండటంతో సైలెంట్‌గా ఉంటున్నాయి. ఇక శ్రీరెడ్డికి అపూర్వ, అనసూయ వంటి వారి నుంచి కంగనా రౌనత్‌ వరకు మద్దతు లభిస్తోంది. ఇక గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేసిన మరో హీరోయిన్‌ మాధవీలత, ఆమె 'నచ్చావులే, స్నేహితుడా' వంటి చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది. శ్రీరెడ్డి అంటే ఎవరు? ఆమె ఎవరో మాకు తెలియదే అంటున్న వారికి మాధవీలత మాత్రం ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. 

తాజాగా ఆమె తన ఫేస్‌ బుక్‌లో మహిళ కూడ ఒక వస్తువే అని చెబుతూ, ఈ విషయాన్ని విమలక్క తన పాతికేళ్ల కిందటే రచనల్లో తెలిపింది అది నేటికి నిజమేనని నిరూపితం అవుతోంది అంటూ 'దిగంబరులు ఊరేగింపు' పేరిట విమలక్క రాసిన ఓ కవితను పోస్ట్‌ చేసింది. 

Woman is a Thing Says Madhavi latha:

Madhavi latha supports Sri Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs