ఎన్టీఆర్‌తో విదేశీ నేపధ్యంలో 'నాన్నకు ప్రేమతో' తీసి, ఇప్పుడు రామ్‌చరణ్‌తో పూర్తి గ్రామీణ వాతావరణంలో 1980ల కాలంనాటి కథతో 'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్‌ని సుకుమార్ కొట్టాడు. దీంతో ఈయన ఏ సబ్జెక్ట్‌నైనా మెప్పించగల వెర్సటైల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఒకవైపు చరణ్‌కి 'మగధీర'ని మించిన ఆల్ టైమ్ హిట్‌ని, తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్‌గా రామ్‌చరణ్ నటనకు వస్తున్న ఫీడ్ బ్యాక్ చూసుకుంటే రామ్‌చరణ్‌తో పాటు చిరంజీవి, పవన్‌కళ్యాణ్ వంటి అందరు గర్వంగా ఫీలయ్యేలా చేసింది ఈ 'రంగస్థలం'. ఇక ఈ చిత్రం షూటింగ్ సమయంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ల టెన్షన్ లేని పక్కా ప్లానింగ్‌ని చూసిన రామ్‌చరణ్ ఇంత మంచి నిర్మాతలు, వారి బేనర్‌లో, సుకుమార్ దర్శకత్వంలో తన తండ్రి చిరుని ఓ సినిమా చేయమని ఒప్పించినట్లు తెలుస్తోంది.
ఇదే నిజమైతే సుకుమార్ మహేష్‌బాబు, మైత్రి మూవీ మేకర్స్ సంస్థల కాంబినేషన్‌లో సినిమా పూర్తయ్యే నాటికి చిరంజీవి 'సై..రా..' కూడా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. కాస్త గ్యాప్ వచ్చినా సుకుమార్ చిరు స్టోరీపై దృష్టి పెడతాడు. సో.. చిరంజీవి 'సై..రా...నరసింహారెడ్డి' తర్వాత చేసే చిత్రం సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ బేనర్‌లోనే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇక విషయానికి వస్తే 'రంగస్థలం' సక్సెస్ తర్వాత మెగా ఫ్యామిలీతో పాటు మెగాభిమానులు కూడా ఎంతో జోష్‌గా ఉన్నారు. 'అజ్ఞాతవాసి, ఇంటెలిజెంట్' దారుణ పరాజయాల నేపధ్యంలో 'తొలి ప్రేమ' ఇప్పుడు 'రంగస్థలం' చిత్రాలు మెగాభిమానుల ఆనందానికి హద్దే లేకుండా చేశాయి.
దాంతో తమ అభిమానుల కోసం రామ్‌చరణ్, మైత్రిమూవీమేకర్స్, సుకుమార్‌లు 'రంగస్థలం' విజయోత్సవ సభను భారీగా నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఆల్‌రెడీ ఈ చిత్రం విజయోత్సవ సభలో మాట్లాడుతానని పవన్ కూడా హింట్ ఇచ్చాడు. తాజా సమాచారం ప్రకారం 'రంగస్థలం' విజయోత్సవ సభను హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో 13వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు పవన్‌కళ్యాణ్ ప్రత్యేక అతిధిగా రానున్నారని చిత్ర యూనిట్ తెలిపింది.