Advertisement
Google Ads BL

మళ్లీ మహేష్ నుంచి పిలుపొచ్చిందంట!


ప్రస్తుతం 'రంగస్థలం' హిట్ తో సుకుమార్ ఫుల్ ఖుషీగా వున్నాడు. 'రంగస్థలం' సినిమా విడుదలై రేపు శుక్రవారానికి 15  రోజులు పూర్తి కావొస్తుంది. ఇప్పటికే రామ్ చరణ్ 'మగధీర' చిత్రం రికార్డులను తుడిచేసి చిరు కామ్ బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150' రికార్డులు తుడిచెయ్యడానికి రెడీ అవుతుంది. చాలా చోట్ల నాన్ 'బాహుబలి' రికార్డులు సృష్టిస్తున్న 'రంగస్థలం' దర్శకుడు సుకుమార్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ హీరోతో? అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. కానీ సుకుమార్ దగ్గర రెండు మూడు కథలున్నాయని.. కానీ ఇంతవరకు వాటిని ఎవ్వరికి వినిపించలేదని... కానీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా 'రంగస్థలం' నిర్మాతలయిన మైత్రి మూవీస్ వారికే చేస్తానని సుకుమార్ చెప్పాడు.

Advertisement
CJ Advs

కానీ సుకుమార్ నెక్స్ట్ హీరోలు వీరేనంటూ అనేకమంది పేర్లు వినబడుతున్నాయి. అందులో మొదటగా మెగాస్టార్ చిరుతో సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అన్నారు. కానీ ఆ వార్తలను సుకుమార్ ఖండించాడు. తర్వాత 'రంగస్థలం' హీరో రామ్ చరణ్ తోనే మళ్ళీ అన్నారు. అలాగే 'ఆర్య' తో తనకి లైఫ్ ఇచ్చిన అల్లు అర్జున్ తో సుకుమార్ నెక్స్ట్ మూవీ అన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లోకి మహేష్ వచ్చి చేరాడు. సుకుమార్ - మహేష్ కలయికలో వచ్చిన '1 నేనొక్కడినే' సినిమా యావరేజ్ టాక్ తో అయినా చివరికి ప్లాప్ అయ్యింది. అయితే చాలా ఇంటర్వూస్ లో మహేష్ తో తాను చేసిన సినిమా ప్లాప్ అయ్యింది కాబట్టి.. మహేష్ తో మరో సినిమా చేసి హిట్ ఇవ్వాలనుకున్నట్టుగా చెప్పాడు సుకుమార్.

అయితే ఇప్పుడు మహేష్ బాబు 'రంగస్థలం' హిట్ తో ఉన్న సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ... మహేష్, వంశి పైడిపల్లి తో తన 25 వ సినిమాని కంప్లీట్ చేశాక సుక్కుతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తాడని టాక్ వినబడుతుంది. ఇక ఎలాగూ మైత్రి మూవీస్ లో 'శ్రీమంతుడు' వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు ఇప్పుడు  సుకుమార్ డైరెక్షన్ లోనే మైత్రి మూవీస్ లో సినిమా చేయబోతున్నాడట. ఎలాగూ వంశి సినిమా తర్వాత మహేష్ ఏ డైరెక్టర్ తో కమిట్ అవ్వలేదు. అందుకే సుకుమార్ - మహేష్ కాంబోలో మూవీ వార్తలకు కాస్త బలం వచ్చింది. ఇకపోతే 'రంగస్థలం' సక్సెస్ మీట్ పూర్తి చేసుకుని సుకుమార్ తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు టూర్ వెళ్లనున్నాడట. ఇక అక్కడి నుండి వచ్చాకే సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ హీరో ఎవరనేది ప్రకటిస్తాడని తెలుస్తోంది.

Sukumar to work with Mahesh Babu again!:

Mahesh Babu in Sukumar direction
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs