Advertisement
Google Ads BL

సూపర్‌స్టార్‌ పాత్రకి మహేష్ ఒప్పుకున్నట్లేనా?


సినిమాల విషయంలో డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌గా నిర్ణయాలు తీసుకోవడం, నష్టపోయిన నిర్మాతలు, బయ్యర్లకు ఆపన్నహస్తం అందించడంలో సూపర్‌స్టార్‌కృష్ణ ముందు వరుసలో ఉండేవాడు. తెలుగులో మొట్టమొదటి సూపర్‌స్టార్‌ అనే బిరుడు కృష్ణకే వచ్చింది. ఇక కృష్ణ విషయానికి వస్తేనాడు ఎన్టీఆర్‌తో ఆయనకు పలు విషయాలలో విభేదాలు ఉండేవి. ఎన్టీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలుగా 'మండలాధీశుడు, సాహసమే నా ఊపిరి' వంటి చిత్రాలను ఆయన తీశాడు. ఇక కృష్ణ మొదటి నుంచి కాంగ్రెస్‌ వాది. దాంతో ఆయన ఏలూరు నుంచి పోటీ చేసి ఎంపీగా కూడా గెలిచాడు. రాజీవ్‌గాంధీకి అత్యంత సన్నిహితుల్లో కృష్ణ ముందు వరుసలో ఉంటాడు. అమితాబ్‌, కృష్ణలకు రాజీవ్‌ ఎక్కువ విలువ ఇచ్చేవాడు. రాజీవ్‌గాంధీ బతికుంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలిస్తే కృష్ణనే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రచారం సాగింది. 

Advertisement
CJ Advs

ఇక ఎన్టీఆర్‌తో పోటీగా కృష్ణ 'అల్లూరి సీతారామరాజు' చేశాడు. ఎన్టీఆర్‌ 'దాన వీరశూరకర్ణ'కి పోటీగా కృష్ణ 'కురుక్షేత్రం' వంటి చిత్రాలు చేశాడు. ఇంతగా ఎన్టీఆర్‌కి, కృష్ణకి విభేదాలు ఉన్నా కూడా వారు 'దేవుడు చేసిన మనుషులు, వయ్యారి భామలు-వగలమారి భర్తలు' వంటి చిత్రాలలో కలసి నటించారు. ఇక ఎన్టీఆర్‌ బయోపిక్‌ అంటే కృష్ణ పాత్ర తప్పనిసరి. మరి ఈ పాత్రను పోషించమని 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ని తేజ దర్శకత్వంలో తెరకెక్కించనున్న బాలయ్య మహేష్‌ని రిక్వెస్ట్‌ చేశాడని, దానికి తన తండ్రి పాత్రేకావడంతో మహేష్‌ కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఎన్టీఆర్‌ స్థానంలో బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రంలో కృష్ణ పాత్రని చేయడానికి మహేష్‌ అంగీకరించాడంటే ఈ చిత్రంలో అసలు విషయాన్నికాకుండా ఎన్టీఆర్‌, కృష్ణల అనుబంధాన్ని మాత్రమే మంచిగా చూపిస్తారని అర్ధమవుతోంది. 

ఇక ఎన్టీఆర్‌తో పాటు సమకాలీనులైన ఏయన్నార్‌, కృష్ణంరాజు, శోభన్‌బాబు వంటి పాత్రలను కూడా పలువురు పేరున్న నటీనటులచేతనే చేయించాని బాలయ్య పట్టుదలతో ఉన్నాడని సమాచారం. ఇక ఏయన్నార్‌ పాత్రని నాగార్జున లేదా నాగచైతన్య, కృష్ణంరాజు పాత్రకి ప్రభాస్‌వంటి వారిని కూడా బాలయ్య ఒప్పిస్తాడేమో చూడాల్సివుంది...! 

Mahesh Babu Plays Krishna Role in NTR Biopic:

Mahesh Babu in Balakrishna's NTR Biopic
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs