రాజమౌళి డైరెక్ట్ చేసే సినిమాలకు అతని కుటుంబం వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తుంది. కుటుంబం సహకారంతోనే రాజమౌళి సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా టాలీవుడ్ ని ఏలుతున్నాడు. అన్నగారు సంగీతం అందిస్తుంటే.. ఆయన తండ్రి గారు కథ ఇస్తారు. ఇక వదిన, కొడుకు, భార్య ఇలా కుటుంబంలోని ఎవరైనా సరే రాజమౌళి సినిమాల్లో పాలుపంచుకుంటారు. తన సినిమాలను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథతో ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించే రాజమౌళి ఈసారి తన తండ్రి కథతో సినిమా చేయడం లేదని న్యూస్ మాములుగా హైలెట్ కాలేదు. రాజమౌళి తన మొదటి సినిమా ఎన్టీఆర్ తో తీసిన స్టూడెంట్ నెంబర్ 1 కి తప్ప మిగతా సినిమాలన్నింటినీ తన తండ్రి కథతోనే తెరకెక్కించి ఎదురులేని హిట్స్ అందుకున్నాడు రాజమౌళి..
అయితే తాజాగా రాజమౌళి... రామారావు, రామ్ చరణ్ లు కలిసి చెయ్యబోయే బడా మల్టీస్టారర్ కి విజయేంద్ర ప్రసాద్ కథ అందించడం లేదట. మరి ఇప్పటివరకు విజయేంద్ర ప్రసాద్ ఆధ్వరంలో మల్టీస్టారర్ కథ అండర్ ప్రాసెస్ లో ఉంది అని అందరూ అనుకుంటూ వచ్చారు. మరి ఇప్పటివరకు సూపర్ కథలందించిన విజయేంద్ర ప్రసాద్ చరణ్, ఎన్టీఆర్ ల సినిమాకి ఎలాంటి కథ అందిస్తాడో అనే క్యూరియాసిటీ మాత్రం ప్రతి ఒక్కరిలో కలిగింది. కానీ తాజాగా విజయేంద్ర ప్రసాద్ కథతో కాకుండా మరొకరి కథతో రాజమౌళి సినిమా చేయబోతున్నాడట. అది కూడా రాజమౌళికి ఫ్యామిలీ ఫ్రెండైన గుణ్ణం గంగరాజు కథతో #RRR మల్టీస్టారర్ తియ్యబోతున్నట్టుగా చెబుతున్నారు.
గుణ్ణం గంగరాజు చెప్పిన కథకు రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ లు కూడా కనెక్ట్ అయ్యి.. ఆ కథను డెవలప్ చేసే పనిలో ఉన్నారట. ఇప్పటికే కథ మీద పూర్తి పట్టు సాధించిన రాజమౌళి ఫ్యామిలీ ఇప్పుడు కథని డెవలప్ చేసి సినిమాని అక్టోబర్ కల్లా పట్టాలెక్కించాలని కృత నిశ్చయంతో ఉన్నారట. మరి గుణ్ణం గంగరాజు చెప్పిన కథ కూడా .. 1980 ఒలింపిక్స్ బ్యాక్ డ్రాపులో క్రీడా ప్రధానంగా ఉంటుందని సమాచారం. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ బాక్సర్ గా కనిపిస్తే, రామ్ చరణ్ హార్స్ రైడర్ గా కనిపించబోతున్నాడని కూడా ప్రచారంలో ఉంది. ఇకపోతే ఈ సినిమా 250 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోందని న్యూస్ కూడా ఉంది.