Advertisement
Google Ads BL

అమీర్ ఖాన్ భయపడి వెనక్కి తగ్గాడు!


బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నుండి సినిమా వస్తుంది అంటేనే ట్రేడ్ వర్గాల నుండి ప్రేక్షకుల వరకు పిచ్చ క్రేజ్ ఉంటుంది. అలాగే ఆయన సినిమాల్లోని పాత్రలకు అనుగుణంగా తన శరీరాకృతిని మార్చుకోవడానికి సర్వం సన్నద్ధం అంటాడు. దంగల్ కోసం బాధ్యత గల తండ్రిగా ట్రైనర్ గా అమీర్ ఖాన్ శరీరం దృడంగా ఉండాలి కాబట్టి కండలు పెంచాడు. మళ్ళీ ఇప్పుడు అమీర్ చాలా సన్నగా అందంగా తయారైపోయాడు. ఇకపోతే ఇప్పుడు అందరూ పురాణాలను తెరకెక్కిస్తూ హిట్స్ కొట్టాలని అన్ని భాషల  దర్శక నిర్మాతలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే కొన్నాళ్ల క్రితం భారీ బడ్జెట్ తో మహాభారతాన్ని కూడా అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిస్తున్నామని... ఆ సినిమాలో తాను నటిస్తున్నానని కూడా అమీర్ ఖాన్ మీడియా ముఖంగా తెలియజేశాడు. కానీ ఇలాంటి భారీ ప్రాజెక్టుని చెయ్యడానికి కొంత టైం పడుతుందని  చెప్పిన ఈ బాలీవుడ్ హీరోగారు ఇప్పుడు మహాభారతం సినిమా విషయమై వెనక్కి తగ్గినట్లుగా వార్తలొస్తున్నాయి. తాను మహాభారతం సినిమాను 5 భాగాలుగా తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు వస్తానని... అలాగే.. ప్రతి భాగం భారీ బడ్జెట్ తో రూపొందుతుందని కూడా అమీర్ ఖాన్ అప్పట్లో సెలివిచ్చాడు. అంతేకాకుండా మహాభారతంలో తాను శ్రీ కృష్ణుడిగాను, కర్ణుడిగాను నటిస్తానని కూడా చెప్పాడు. 

అయితే అమీర్ అలా ప్రకటించాక కొంతమంది ముస్లిం నేతలు అమీర్ ఖాన్ ముస్లిం అయ్యుండి మహాభారతం సినిమాలో నటించడమేంటంటూ  తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముస్లిం పెద్దల విమర్శనలతో ఆలోచనలో పడ్డ అమీర్.. మహాభారతం ప్రాజెక్ట్ ని చేసే విషయమై ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది. మరి చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమాలు విడుదలయ్యాక, విధుల కాకమునుపు అనేక అగచాట్లు పడుతున్నాయి. చరిత్రని వక్రీకరించి సినిమాలు చేస్తున్నారంటూ ఆ సినిమాలను విడుదల కాకుండా అడ్డుకుంటున్నారు. ఆ సమస్యలు చూసిన తర్వాత మహాభారతంపై అమీర్ ఖాన్ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తుంది.

Aamir Khan may drop plans to make Mahabharata:

Bollywood Hero Aamir Khan May Not Make The Mahabharata After All
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs